Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

ఉపాధి హామీ కూలీల రోజువారి సరాసరి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

ఉపాధి హామీ కూలీలకు సరాసరి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు జరిగిన టెలికాన్ఫరెన్స్లో

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పనిని కోరుకునే వేతన కూలీలకు రోజువారి సరాసరి వేతనం రూ.240 కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి అమరావతి నుండి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నరేగా ద్వారా లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయాలు ,ఆర్ బి కే లు, వైయస్సార్ హెల్త్ క్లినిక్లు, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు జగనన్న పాలవెల్లువ, నాడు నేడు, ద్వారా పాఠశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇండ్ల స్థలాలు, జగనన్న హౌసింగ్ కాలనీలు, 90 రోజుల్లో ఇంటి స్థలం మంజూరు ,వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు భూ రక్షా రిసర్వే స్పందన గ్రీవెన్స్ జాతీయ రహదారులు, ఇరిగేషన్ సంబంధించిన భూసేకరణ తదితర అంశాలు పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు ఒక నెలలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు గ్రామ సచివాలయాలన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అధికారులతో మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు సంక్షేమ పరమావధిగా రూపుదిద్దుకుంటున్న ఆర్ బి కే లు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు బలోపేతానికి, ఫ్యామిలీ డాక్టర్ విధానం కొరకు నిర్మిస్తున్న వైయస్సార్ హెల్త్ క్లినిక్లు, విజ్ఞాన సముపార్జనకై అమల్లోకి తెస్తున్న డిజిటల్ లైబ్రరీలు నిర్మాణాల్లో భాగంగా స్టేజ్ కన్వర్షన్ ద్వారా స్టేజ్ అప్గ్రేడేషన్ కొరకు వారం వారం సమీక్షలు నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న అక్టోబర్ రెండో తేదీ నాటికి గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా పాడి పరిశ్రమ అభివృద్ధికై నిర్మిస్తున్న ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్స్ యూనిట్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మాణాలను వేగిర పరచాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీలకు డిసెంబర్ నాటికి ఫైబర్ నెట్ కనెక్షన్ అందుబాటులో రానున్నదన్నారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి రీ సర్వే పూర్తిచేసిన గ్రామాలలో భూ హక్కు పత్రాలు జారీకి చర్యలు గైకొనాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు నిరంతర పరివేక్షణకై చర్యలు గైకొనాలని పూర్తి నాణ్యత ప్రమాణాలతో భవనాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. నాడు నేడు రెండో దశ కింద మంజూరైన పాఠశాలల భవనాలన్నిటిని ఈ నెలాఖరు నాటికి గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. నాడు నేడు పనులను హెచ్ఎంలు ,డిఎం అండ్ హెచ్ ఓ ఎంపీడీవో సమన్వయంతో చేపట్టి సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. నాడు నేడు పనులకు సంబంధించి మెటీరియల్ను సెంట్రల్ గా ప్రొక్యూర్ చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. ఆప్షన్ త్రీ కింద చేపట్టిన గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. జగనన్న కాలనీలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రతి లేఔట్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు 90 రోజుల్లో ఇంటి పట్టా మంజూరు చేస్తూ పట్టాలు ,పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు. పట్టాలు పొజిషన్ సర్టిఫికెట్లపై ఆడిట్ కూడా జరగాలన్నారు. రీ సర్వే గురించి ప్రస్తావిస్తూ ముఖ్యంగా నాలుగు అంశాలపై దృష్టి సారించాలని ఓ ఆర్ ఐ ఇమేజ్ జనరేషన్, గ్రౌండ్ రూటింగ్, 13- నోటిఫికేషన్ హక్కుపత్రాలు జారీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మూడు దశల్లో రీసర్వేను పూర్తి చేయాలని దీనికి సమాంతరంగా రెవెన్యూ రికార్డులు సర్వే రికార్డులు స్వచ్ఛకరణ ఆన్లైన్ డేటా ఎంట్రీ జరగాలన్నారు, సర్వే చట్ట ప్రకారం రి సర్వే మెకానిజం ఉండాలన్నారు. స్పందన గ్రీవెన్స్ గురించి ప్రస్తావిస్తూ గడువు దాటిన అర్జీలు లేకుండా అందిన అర్జీ ఓపెన్ కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పూర్తి నాణ్యత ప్రమాణాలతో పూర్తిస్థాయిలో పరిష్కార మార్గాలు చూపుతూ ప్రభుత్వ పనితీరు పట్ల విశ్వాసాన్ని అర్జీదారులలో నింపాలని ఆయన సూచించారు. ప్రతి సచివాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలు ఉండే ఐదు గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించాలని అదేవిధంగా సోమవారం మండల డివిజన్ స్థాయిలో స్పందన కార్యక్రమం పక డ్బందీగా నిర్వహించి అర్జీలపై సత్వరమే స్పందించి పూర్తి నాణ్యతతో పరిష్కార మార్గాలు సకాలంలో చూపాలన్నారు. ఔటర్ రీచ్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు జాతీయ రహదారులకు అవసరమైన భూముల సేకరణ కొరకు భూ సేకరణను ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అధికారులు తమ పరిధిలోని అంశాలపై నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు కార్యక్రమాలు నిర్వహణలో ఎదురైనా చిన్నపాటి సమస్యలను అధిగమించి ముందడుగు వేయాలని సూచించారు. సుస్థిరాభివృద్ధి కార్యక్రమాల ద్వారా వృద్ధిరేటు సాధనకు అందరూ పూర్తి సమన్వయంతో పాటుపడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర ,డిఆర్ఓ సిఎస్ సత్తిబాబు పంచాయతీరాజ్ ఎస్. ఇ చంటిబాబు డిపిఓ కృష్ణకుమారి,డ్వామా పీడీ మధుసూదన్, డిఎంహెచ్వో డాక్టర్ జి జోత్న, వ్యవసాయ శాఖ జీడి వై ఆనంద్ కుమారి ,మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ ఏ.జైపాల్, డి ఆర్ డి ఎ. పి డి శివశంకర్ ప్రసాద్ ,గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు శ్రీనివాస్ సర్వే ఏడి గోపాలకృష్ణ సిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

 

.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!