Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

ఇదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ఆగని అక్రమ కట్టడాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం మండలం:

యధేచ్చగా అక్రమ నిర్మాణాలు

-ఆగని అక్రమ కట్టడాలు

 

– ప్రభుత్వ నిబంధనలకు తూట్లు

 

-రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ?

-లక్షల్లో పంచాయతీ ఆదాయానికిగండి

 

– చోద్యం చూస్తున్న పంచాయతీ అధికారులు

 

(విశ్వం వాయిస్ ప్రత్యేక ప్రతినిధి సి. హెచ్.ప్రతాప్)

 

రాయవరం మండలం లో ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టే నాధుడు కరువయ్యాడు. గ్రామాల్లో ఆకాశాన్నంటే నిర్మాణాలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. చిన్నపాటి ఇంటి నిర్మాణాలకు రకరకాల నిబంధనలు పెట్టే గ్రామ పంచాయతీ వారికి ఈ ఆకాశ హర్మ్యాలు అధికారుల కంటికి కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

 

మండలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జి ప్లస్ టు మాత్రమే నిర్మించవచ్చు కాని కొందరు జి ప్లస్ టు కు అనుమతులు తీసుకుని జి ప్లస్ త్రీ భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని భవనాలలో అనుమతుల కంటే రెండు, మూడు అదనపు అంతస్థుల నిర్మాణం జరగగా తాజాగా సెల్లార్ నిర్మాణం కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా నివాసం (రెసిడెన్షియల్) కోసం అనుమతులు తీసుకుని అనంతరం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం .

 

భవన నిర్మాణాల అనుమతి కోసం ప్రస్తుత రేట్ల ప్రకారం ప్రతి చదరపు మీటర్ కు నివాస గృహాలకు రు 10, కమర్షియల్ గృహాలకు రు 20 పంచాయితీకి చెల్లించాల్సి ఉంటుంది. నివాస గృహాలకు అనుమతులు తీసుకుని కమర్షియల్ గృహాలు నిర్మించి నట్లయితే పంచాయితీలకు లక్షల్లో ఆదాయానికి గండి పడుతుంది.-

 

అదనపు అంతస్థుల అనుమతి కోసం ప్లాన్ సమర్పించే తరుణంలోనే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ కు అప్లై చేయాల్సి వుంటుంది. అయితే ఈ పద్ధతిని దాదాపు ఎవరూ పాటించడం లేదని రాయవరం మండల పరిధిలో జరుగుతున్న నిర్మాణ శైలి చూస్తే అవగతమవుతోంది.

 

ఇటువంటి కట్టడాలు నిలిపివేసి సంబంధిత బిల్డర్లపై పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటు వున్నా అధికారులు ఎందుకు తీసుకోవడం లేదన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

 

ఇక రాయవరం గ్రామంలో అక్రమ నిర్మాణాల హవా యధేచ్చగా సాగుతోంది. రాష్ట్రంలో 2015 వ సంవత్సరంలో వచ్చిన బి ఆర్ ఎస్ పథకం ద్వారా అప్పట్లో లక్షలాది భవనాలు నామమాత్రపు పెనాల్టీతో రెగ్యులరైజ్ అయ్యాయి. ఇక్కడ కూడా ఇదే విధమైన విధానాన్ని నిర్మాణదారులు అవలంబించే అవకాశం వుంది. అయితే ప్లానింగ్ స్థాయిలో , అనంతరం పునాదుల స్థాయిలోనే అనుమతులు లేని కట్టడాలు నివారించాల్సిన పంచాయతీ అధికారులు భవనాలు నిర్మాణం శరవేగంగా పూర్తవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు

ప్రశ్నిస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!