Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

మాజీ ఎంపీ కొత్తపల్లి గీత సహకారంతో వరద బాధితులకు చేయూత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మాజీ ఎంపీ , బిజెపి సీనియర్ నాయకురాలు కొత్తపల్లి గీత సహకారంతో వరద బాధితులకు చేయూత
– కృష్ణవరం గ్రామంలో వరద బాధితులకు బిందెలు దుప్పట్లు పంపిణీ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

మాజీ ఎంపీ , భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు కొత్తపల్లి గీత సహకారంతో ఎటపాక మండల పరిధిలోని కృష్ణవరం గ్రామంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లా ప్రసాద్ , మండల అధ్యక్షుడు మోదుగు పెరమయ్య నేతృత్వంలో బిజెపి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కుంజం వీర వెంకట సత్యనారాయణమ్మ చేతుల మీదుగా 200 కుటుంబాలకు బిందెలు , దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ప్రసాద్ , పెరమయ్య మాట్లాడారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు ముంపు మండలాల ప్రజలు సర్వం కోల్పోయారని , భారతీయ జనతా పార్టీ తరుపున పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కోన్నారు. ముంపు గ్రామాల పరిస్థితి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దృష్టికి తీసుకెళ్లడంతో వారి వంతుగా సహాయ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఎటపాక మండలం మొత్తాన్ని 41 కంటూర్ లెవెల్ వర్తింప చేయాలనీ , ప్రతీ ఒక్క నిర్వాసితునికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన ప్యాకేజి, పునరావాసం అందించాలన్నారు. రానున్న కాలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవలు అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి విలీన మండలాల సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు గంధం జయమ్మ , పేరాల రాజు, నాంపల్లి రమేష్ , సూదిపాక శ్రీనివాస్, పులుసు పుల్లారావు , కొరసా కృష్ణ , ములకపల్లి రామకృష్ణ , కొట్టే రాంబాబు , చింతా దుర్గయ్య , చిరంజీవి కార్యకర్తలు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!