విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం బట్టలు:
క్రీడా పరికరాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారి సిహెచ్ .సత్తిబాబు
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ క్రీడ ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2022వ సంవత్సరానికి సంబంధించిన క్రీడా పరికరాలు పంపిణీ : బుధవారం నాడు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా రెవెన్యూ అధికారి సి హెచ్. సత్తిబాబు ద్వారా క్రీడా పరికరాలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎస్ .ఎ.ఎ.పి సమన్వయకర్త మహా లక్ష్మయ్య , కోనసీమ జిల్లా వ్యాయామ సంఘ అధ్యక్షులు ముసలయ్య, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎం రమేష్, జిల్లా ఆచ్చారి సంఘ అధ్యక్షులు గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో చీప్ కోచ్ పి.ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిఆర్ఓ సత్తిబాబు
వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, మరియు క్రీడా సంఘలను ఉద్దేశించి జిల్లాలో క్రీడ అభివృద్ధికి ప్రణాళికలు చేయాలని జిల్లా కలెక్టర్ క్రీడాకారులుగా ఉన్న జిల్లాలో క్రీడాభివృద్ధికి చక్కని ప్రణాళికతో బాటలు వేయాలని జిల్లా అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని తమ వంతు కృషి మరియు సహకారం క్రీడలపై ఎప్పుడు ఉంటాయని తెలియజేశారు.