Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం వేగవంతం చేయాలి జెసి ధ్యాన చంద్ర

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం వేగవంతం చేయాలి జె.సి ధ్యానచంద్ర

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు బుధవారం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పన, గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర గృహ నిర్మాణ సంస్థ, పంచాయతీ రాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమల్లో పురోగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన లేఅవుట్లు గ్రామాల వారీగా మౌనిక వసతులకు కల్పన నిర్దేశించిన పనులలో పురోగతిపై సమీక్షించి ఆయా పనుల పూర్తి చేసేందుకు గాను ఇంజనీర్లకు నిర్దేశిత గడువులను విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణ సంస్థ లైజన్ గా 8 శాఖలు జగనన్న కాలనీలో అభివృద్ధి పనులపై పనిచేస్తున్నాయని అందరూ పరస్పర అవగాహనతో ఆశించిన స్థాయిలో పురోగతిని తీసుకురావాలని ఆయన ఆదేశించారు. టెండర్లు పిలిచిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేసిన పనులకు వెంటనే బిల్లులు ఎం బుక్ తో సహా సమర్పించి ఆన్లైన్లో పురోగతిని ప్రతిబింబించేలా ఎప్పటికప్పుడు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. పేపర్ వర్క్, టెండర్లు పిలవడం సాంకేతిక అనుమతులు పరిపాలనామోదం తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు ప్రత్యేక చొరవ తీసుకుని జగనన్న కాలనీల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. చేపట్టిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు జనరేట్ చేస్తూ హౌసింగ్ పథక సంచాలకు వారికి ఆన్లైన్లో సమర్పిస్తే నిధులు చెల్లింపుకు తాను చర్యలు చేపడతానని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ గృహ నిర్మాణ సంస్థ శాఖలకు సంబంధించి సంబంధించి ఏ ఈ, డి ఈ, ఈ ఈ స్థాయిలలో పనుల పురోగతిని గూర్చి సమీక్షించారు. నత్తనడకన పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్లను చైతన్యపరిచి నిర్దేశిత కాలవ్యవధిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. వివిధ జగనన్న కాలనీ లేఔట్లలో ఇంకా ఏమన్నా అభివృద్ధి పనులు అవసరం ఉన్నయెడల తమ దృష్టికి తేవాలని ఇంజనీర్లు సూచించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న కాలనీలలో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎం.బుక్ రికార్డింగ్ చేపడుతూ మౌలిక సదుపాయాలైన కల్వర్టులు అంతర్గత రోడ్లు అప్రోచ్ రోడ్లు విద్యుత్ సరఫరా త్రాగునీటి వసతులు వంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి గృహ లబ్ధిదారులకు ఆయా వసతులను అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు శ్రీనివాస్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ఎస్ ఈ. సి హెచ్. ఎన్. వి. కృష్ణారెడ్డి పంచాయతీ రాజ్ ఎస్. ఈ చంటిబాబు పంచాయతీరాజ్, గృహ నిర్మాణ సంస్థ ఈఈలు డిఈలు ఏఈలు పాల్గొన్నారు

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!