Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

రూరల్ లో ముస్లిం షాదీ ఖానా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ భరత్,చందన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రూరల్ లో ముస్లిం షాదీ ఖానా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ భరత్,చందన

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం రూరల్:

రూరల్ లో ముస్లిం షాదీ ఖానా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ భరత్,చందన

రాజమహేంద్రవరం రూరల్,(విశ్వం వాయిస్ న్యూస్):

శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్, కొంతమూరు గ్రామంలో ముస్లిం మైనారిటీస్ షాదీ ఖానా పనులను శంకుస్థాపన చేసిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్, విశిష్ట అతిధిగా పాల్గొన్న రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్.ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈ గ్రామంలోని ముస్లిం సోదరుల చిరకాల వాంఛ ఇక్కడ ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులకు వారి కుటుంబాలలో ఎమన్నా శుభాకార్యం చేయడానికి సరి అయిన వసతులు లేక ఇబ్బంది పడుతూ తన దగ్గరకు వచ్చి మంచి షాదీ ఖానా నిర్మాణం కొరకు కోరగా వెంటనే తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని ఎంపీ భరత్ తెలిపారు.
అంతకు పూర్వం ఇదే షాది ఖానా కు 30 లక్షలు మంజూరు చేసిన గత ప్రభుత్వం దాని నిర్మాణం జాప్యం చేయడం అది అలా నిర్మాణం కాకుండా ఉండిపోయిందని ఎంపీ భరత్ తెలిపారు….
త్వరలో ఇక్కడ మంచి అత్యాధునిక వసతులతో మంచి షాది ఖానా నిర్మాణం చేసే విధముగా చర్యలు తీసుకుంటామని ఒకవేళ నేను నా ఎంపీ లాడ్స్ నిధుల నుండి ఇచ్చినది సరిపోని పక్షంలో అదనపు నిధులు ఇచ్చే విధముగా చర్యలు తీసుకుంటానని ఎంపీ భరత్ తెలిపారు.ఈ షాదీ ఖానా నిర్మాణం కొరకు మన రూరల్ కోఆర్డినేటర్ 5 లక్షల రూపాయలు తన వంతు సహాయము గా ఇస్తే బాగుంటుంది అని, అలాగే స్థానిక ముస్లిం పెద్దలు డాక్టర్ బేగ్ వారి తనయులు కలసి ఒక లక్ష యాభైయ్ వేలు విరాళం ఇవ్వడం, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ భరత్.ఈ నిర్మాణం చేసే కాంట్రాక్టర్ ను పిలిచి నిర్మాణం తగు రీతిలో చేసి ఇటువంటి షాదీ ఖానా రాష్ట్రంలో ఎక్కడా లేని విధముగా ఉండాలని కోరిన ఎంపీ భరత్.ఈ కార్యక్రమంలో గ్రామంలో వైస్సార్సీపీ నాయకులు, వైస్సార్సీపీ ముస్లిం సోదరులు, సోదరీమణులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!