Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

అజ్జరపు వాసు అధ్వర్యంలో మదర్ థెరిస్సా జయంతి సేవలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మానవతా మూర్తి మదర్ థెరిస్సా కు ఘన నివాళి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్):  మానవత్వానికి నిజమైన ప్రతిరూపం మదర్ థెరెస్సా అని, నేటి యువత ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ కార్పొరేటర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జరపు వాసు అన్నారు.మదర్ థెరెస్సా జయంతి సందర్భంగా మదర్ థెరెస్సా మిలీనియం యూత్ ఆధ్వర్యంలో సంజీవనగర్ లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. ముందుగా మదర్ థెరిస్సా విగ్రహానికి అజ్జరపు వాసు, డివిజన్ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అజ్జరపు వాసు కేక్ కట్ చేశారు.ఆ తరువాత లాలాచెరువు రోడ్డులోని గౌతమి జీవ కారుణ్య సంఘం లో ఉన్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ థెరిస్సా పేరు వినగానే ఆమె సేవా జీవితం గుర్తొస్తాయని, ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఎన్నో వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు వెలిసాయని అన్నారు‌. నేటి యువత ఆమె సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవకారుణ్య సంఘం ఈఒ ఐ.కిషోర్, డివిజన్ పెద్దలు కర్రి కొండలరావు, రేబాక నాగేశ్వరరావు, బుడ్డిగ దేవుడు, పిండి రాధాకృష్ణ,బత్తిన అబ్బులు,విజ్జిన మధు,బత్తిన గంగరాజు,గొంపా సుధాకర్,మాణిక్యం, బంటి, ప్రసాద్,ఉప్పు సత్తిబాబు,తామాడ దుర్గాప్రసాద్, జగదీష్, రాజు,సూరి,మడగల దుర్గ,లింగరాజు, చిన్ని కోట,కనకరాజు,నల్లం గణేష్,శివ, సత్తిబాబు,పండు,మడికి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!