Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 9:32 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 9:32 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 9:32 AM
Follow Us

బాధితులకు న్యాయం జరిగేవరకు తగ్గేదే లే!

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అధికార పార్టీలో ఉండీ పోరాడాల్సి వస్తుంది

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

బాధితులకు న్యాయం జరిగేవరకు తగ్గేదే లే!

– ప్రైవేట్ వ్యక్తులతో కలిసి రోడ్డును మింగేశారు

– కబ్జా చేసిన స్థలాల కోసం పేదల పాకలు పీకేసారు

– నాలుగు రోజులుగా రోడ్డుమీదే తిండి..నిద్ర

– కబ్జాదారులను వెనకేసుకు వస్తున్నారు.

– అధికార పార్టీలో ఉండీ పోరాడాల్సి వస్తుంది

– పార్టీ నుంచి పొమ్మంటే క్షణంలో బయటకు పోతా

– నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ బర్రే కొండబాబు

రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్): క్వారీ ప్రాంతంలో అన్యాయంగా పూరి గుడిసెలు తొలగించిన బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని, ఎట్డి పరిస్థితిలో తగ్గేది లేదని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్, వైసిపి సీనియర్ నాయకులు బర్రే కొండబాబు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణం పేరు చెప్పి నలభై యేళ్ళగా అక్కడే నివసిస్తూ, జీవనం గడుపుతున్న కడు పేదలైన వారి గుడిసెలను ప్రైవేట్ వ్యక్తులు మెషిన్ లు తీసుకు వచ్చి తొలగిస్తే వారిపై చర్యలు తీసుకోక పోగా, అక్కడ బాధితులు వేసుకున్న న్న గుడారాలను సైతం తహసీల్దారు తొలగించడం అన్యాయమన్నారు. బాధితులకు మద్దతుగా గత నాలుగు రోజులుగా అందోళనకు దిగిన కొండబాబు అక్కడ తిండి, నిద్ర, రోడ్డు మీదే చేస్తున్నారు.ఈ సందర్భంగా నేడు మీడియాకి అక్కడ పరిస్థితులను, కడు పేదలైన బాధితులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. అక్కడ నివాసం ఉండే వారు మసలు కోవడానికి ఉత్తరం వైపున రోడ్డు ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి ఆ రోడ్డును మింగేశారని ఆరోపించారు. క్వారీ గోతులకు గోడ నిర్మించాలని కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్న నేపధ్యంలో క్వారీ ఓనర్ రోడ్డును మింగేసి గోడను నిర్మించారని ఆరోపించారు. అయితే ప్రమాదకర పరిస్థితిలో ఉన్న చోట మాత్రం గోడ నిర్మాణం జరగలేదన్నారు. తాను కబ్జా చేసి అమ్మేసిన స్థలాలకు మార్గం కోసమే ఓ నాయకుడు నలభై యేళ్ళగా అక్కడ జీవనం సాగిస్తున్న నిరు పేదలైన చిట్టిమాను తిరుపతమ్మ, ఎద్దు సింహాచలం, ఎద్దు సత్యవతి, కోరకొండ దుర్గాభవానీల పూరి గుడిసెలు తొలగించారన్నారు. వీరి ఇళ్ళు ఉన్నప్పటికీ అక్కడ రోడ్డు నిర్మించే అవకాసం ఉందన్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రయోజనం కొరకు వీరి గుడిసెలు పీకేశారన్నారు. ముందస్తు నోటీసులు లేకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా గుడిసెలు తొలగిస్తారని ప్రశ్నించారు. అక్కడే బాధితులకు ప్రత్యామ్నాయం కల్పించవచ్చని, అక్కడ ఉన్న ఇళ్లకు ఉత్తరం వైపున రోడ్డు ఉందనీ తాను అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదని, కనీసం రికార్డులను కూడా పరిశీలించడం లేదన్నారు. ఉత్తరం వైపున రోడ్డును ఎవరి ప్రమేయం, సహకారంతో క్వారీ ఓనర్ మింగేసి గోడను నిర్మించారో స్పష్టం చేయాలన్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా సొమ్ములు చేతులు మారాయన్నారు. ఉత్తరం వైపున రోడ్డు ఉందని నిరూపించడానికి తాను సమాచార హక్కు చట్టం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వారి 23 పట్టాల నకళ్ళను తీసుకోవడం జరిగిందన్నారు‌. పట్టాలలో ఉత్తరం వైపున రోడ్డు ఉన్నట్లు స్పష్టంగా చూపుతుందనీ ఈ రోడ్డును క్వారీ కాంట్రాక్టర్ మింగేశాడన్నారు. వీరు అన్యాయం చేసిన నాలుగు కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా తాను అధికారపార్టీలో ఉండి కూడా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా తాను ఇక్కడే ఉండి తిండి, నిద్ర చేస్తూ పోరాడుతున్నా అధికారుల నుండి స్పందన లేదన్నారు. కబ్జాదారునికి, దోపిడీ దారుడికి కొమ్ము కాయడం తగదన్నారు. వీరి నిర్వాకం వల్ల క్వారీ ప్రాంతంలో పార్టీ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు‌. పేదల గుడిసెలు తొలగించి వారిని వీధిన పడేసినందుకు తహశీల్దారు కోర్టులో సమాధానం చెప్పకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పేదలకు అధికారులు అన్యాయం చేస్తుంటే వారిని పిలిపించి ఇది తప్పు అని చేప్పే నాయకులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తాను పోరాడతానని ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని స్పష్టం చేశారు. తనను పొమ్మన లేక పొగబెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీలోకి తనను ఆహ్వానిస్తేనే వచ్చానని, పార్టీ నుండి పొమ్మంటే క్షణంలో వెళ్లిపోతానన్నారు. పొమ్మంటే సీఎంకు చెప్పే పోతానని, అంతే తప్ప ఇలాంటీ దోపిడీలను చూస్తూ ఉండలేను అన్నారు. తాడో పేడో తేలే వరకు తాను ఈ స్థలాన్ని విడిచి పెట్టేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపి సీనియర్ నాయకులు గారా చంటిబాబు,క్వారీ ప్రాంత నాయకులు కూలి సూరిబాబు,బీరా విజయ్, వడిశ లక్ష్మి, కోరుకొండ చిన్నితల్లి,చలపరెడ్డి రాజు(వెల్డర్ రాజు),బాధిత కుటుంబాల వారు, మహిళలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement