విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
యోగాసనాలతో మానవుల జీవితంలో ఎంతో అనేక మార్పులు
-స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో యోగాసనాల
– పోటీల ప్రారంభించిన రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టి.కే. విశ్వేశ్వర్ రెడ్డి
రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్):
శనివారం నాడు ఉదయం రాజమహేంద్రవరం లోని ఏ.పీ. పేపర్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపం నందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని యోగాసనాల పోటీలు మరియు అడ్వాన్స్డ్ యోగాసనా పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టి.కే. విశ్వేశ్వర్ రెడ్డి విచ్చేసి యోగాసనా పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ యోగాసనాలు చేయడం వలన మానవుల జీవితంలో ఎంతో గొప్ప మార్పులు వస్తాయని, ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉంటామని, సాత్విక ఆహారం అలవాటు అవుతుందని, ఆలోచన విధానం కూడా మంచిగా మారుతుందని, మన పూర్వీకులు సనాతన ధర్మంలో ఈ యోగాసనాలు పెట్టడం ద్వారా మానవాళికి చాలా మంచి చేశారన్నారు.యోగా సేవా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ యోగ చేయడం అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం, మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు యోగ పునాది దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు అని చెబుతూ ఒత్తిడితో కూడుకున్న జీవనం సాగిస్తున్న వారికి ఈ యోగా ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ కోచ్ డి.ఎం. ఎం. శేషగిరి మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ యోగా పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని ఈ పోటీలలో బాగా రాణించిన వారికి జాతీయ క్రీడా దినోత్సవం అయిన ఈనెల 29వ తారీకు న బహుమతి ప్రధానం ఉంటుందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ యోగ తెరపిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలకు తూర్పుగోదావరి జిల్లాల లోని వివిధ గురువుల దగ్గర యోగ నేర్చుకున్న విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొని విశేష ప్రతిభ కనపరిచారని వారందరికీ అభినందనలు తెలిపారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ యోగా కోచ్ నాగేంద్ర మాట్లాడుతూ ఈ విధంగా యోగా పోటీలు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని దీనివల్ల యోగాసనాల మీద ప్రజల్లో మంచి అవగాహన కలుగుతుందని తద్వారా వారు కూడా యోగాసనాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యోగ కోచ్ లు,లంక సత్యనారాయణ, పలకమ్శెట్టి రామకృష్ణ, సుబ్బారావు, రాజ్ కుమార్, శివ తదితర యోగా గురువులతో పాటు యోగా సాధన చేస్తున్న విద్యార్థులు కూడా పాల్గొన్నారు.