విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం రూరల్:
రాజమహేంద్రవరం రూరల్,(విశ్వం వాయిస్ న్యూస్):
కలెక్టరేట్ లో వికాస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వికాస – రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కి 82 మంది నిరుద్యోగ యువత హాజరు కాగా 35 మందికి వివిధ ప్రవేటు,బ్యాంకింగ్ సెక్టార్ లో నియామక పత్రాలు అందచేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.శనివారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ,కలెక్టరేట్ లోని వికాస్ కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బహుళజాతి, తదితర కంపెనీ ల ద్వారా ప్రతి వారం ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకోసం సంబంధించిన కంపెనీ ప్రతి నిధులు హాజరై ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు శనివారం రోజున చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నందు 82 మంది హాజరుకాగా 35 మందికి నియామక పత్రాలు అందజేశామన్నారు.ఉద్యోగాలు, ఉపాధి కోసం ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు తూర్పు గోదావరి జిల్లా వికాస్ కేంద్రం మేనేజర్ సత్యనారాయణను 8309010013 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చునని కలెక్టర్ తెలియచేశారు.స్తిరవారం జరిగిన ఇంటర్వ్యూ లకు హాజరైన వారిలో పిల్కింగ్టన్1,యూని పార్ట్స్ 22,ఇండిగో ఎయిర్‌లైన్స్ 2,కీర్తన ఫిన్ సర్వ్ 5,ఆదిత్య బిర్లా 5 గురికి నియామక పత్రాలు అందజేసినట్లు సత్యనారాయణ తెలియ చేశారు.