Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

31వవార్డు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎం.పి మార్గానీ భరత్ రామ్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ప్రజల ఆనందమే మన ప్రభుత్వ లక్ష్యం
-ఎం పి భరత్ రామ్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్):

స్థానిక 31వ వార్డ్ ఇంచార్జి నగర బీ.సీ సెల్ అధ్యక్షులు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో అన్నపూర్ణమ్మపేట సచివాలయ పరిధిలోని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మరియు వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రతీ గడపలోనూ ప్రజలు ఎంపీ మార్గాని భరత్ కి ఘన స్వాగతం పలుకుతూ పరవశింపజేశారు.
ఎంపీ ప్రతీ ఇంటికీ తిరిగి లబ్దిదారులతో మాట్లడుతూ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల సంక్షేమ పాలనలో చేకూరిన లబ్ధిని లబ్ధిదారులకు వివరించారు. జగనన్న సంక్షేమ పాలనలో తాము చాలా సంతోషంగా జీవిస్తున్నామని లబ్దిదారులు ఎంపీ భరత్ కి తెలియ జేస్తూ,మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మకమైన సంక్షేమ పాలన అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు ఎంపీ భరత్ కి వారు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి వైస్సార్సీపీ ఖాదీ బోర్డు కార్పొరేషన్ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, మినరల్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్తి లక్ష్మి,మాజీ కార్పొరేటర్లు మింది నాగేంద్ర,మజ్జి నూకరత్నం, వార్డ్ ఇంచార్జిలు,వివిధ విభాగాల సెల్స్ అధ్యక్షులు,కార్యదర్శులు,పార్టీ శ్రేణులు, నాయకులు,కార్యకర్తలు,అన్నపూర్ణమ్మ పేట సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!