Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 9:21 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 9:21 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 9:21 PM
Follow Us

గణేష్ మండపాలకు అనుమతులు తీసుకోవద్దు – ఏపీ బీజేపీ పిలుపు !

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అధికారులు కావాలనే భక్తులను వేదిస్తున్నారు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:

గణేష్ మండపాలకు అనుమతులు తీసుకోవద్దు
– ఏపీ బీజేపీ పిలుపు !

– అధికారులు కావాలనే భక్తులను వేదిస్తున్నారు

– ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి భాజపా ఎ.పి ప్రధాన కార్యదర్శి

రాజమహేంద్రవరం,(విశ్వం వాయిస్ న్యూస్):
గణేష్ మండపాలకు అనుమతులు తీసుకోవద్దని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ ప్రభుత్వం వినాయక చవితికి కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు పెడుతోందని..డబ్బులు వసూలు చేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలు ఎవరూ మండపాలకు అనుమతులు తీసుకోవద్దని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.ప్రతి సంవత్సరం హిందువుల పవిత్ర పండగకు రాష్ట్ర ప్రభుత్వం,అధికారులు ఎందుకు ఇలా నిబంధనలు పెడతారని ఆయన ప్రశ్నించారు.ఈ అంశంపై ఏపీ ఇంకా అయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి ఆనవాయితీగా చలువపందిళ్లు ఏర్పాటు చేసి వినాయక నవరాత్రులు నిర్వహించే ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం నిబంధనలు పేరుతో పోలీసులు ఉత్సవ కమిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.హిందువుల తొలిపండుగ అయిన వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఉండాలని అంటున్నారు. గత సంవత్సరం కోవిడ్ నిబంధనల పేరుతో వినాయక చవితి ఉత్సవాలను తగ్గించే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఉద్యమం చేసిదని నేతలు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా ఈ సారి కూడా ఎవరూ అనుమతులు తీసుకోవద్దని కోరుతున్నారు.
వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పల్లెల్లో, పట్టణ, నగరాల్లోని అన్ని కూడళ్లలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి హిందూ ధర్మ ఆచారం ,కానీ ఇందుకు విరుద్ధంగా ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టంగానీ,ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు గాని జరపటానికి వీలు లేకుండా, అఫిడవిట్లు ఇవ్వాలని, నిర్వాహకులు సంతకాలతో ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడం, విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని ఇతర నిబంధనల పేరుతో పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్నారని ఆయన విమర్శించారు.దీనిని బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.వినాయక చవితి ఉత్సవాలను జరపాలంటేనే హిందువులు భయపడేలాగా నిబంధనలు విధించడం ఏమాత్రం సరికాదన్నారు.ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు.ఇతర మతాల పండుగకు ఓక నిభందన ,హిందువుల పండుగకు ఓక నిభందనలు చెబుతున్న ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే ప్రత్యేక నిబంధనల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ నిర్వాహకులు తిప్పడం ఏరకంగా సమంజసం అని ఆయన ప్రశ్నించారు. అందువల్ల వెంటనే ఈ అంశంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని వినాయక చవితి ఉత్సవాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో చేసుకునే అవకాశాన్ని కల్పించాలని లేకపోతే.. తాము ఉద్యమిస్తామన్నారు. అనుమతులు తీసుకోకుండా వేసే పందిళ్లకు ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే..తాము అండగా ఉంటామని బీజేపీ నేత అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement