Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సంక్షేమం,అభివృద్ధే జగనన్న లక్ష్యం….

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజానగరం నియోజకవర్గం:

సంక్షేమం,అభివృద్ధే జగనన్న లక్ష్యం….

– ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యానికీ రూ.20 ల‌క్ష‌లు ఇవ్వడం హర్షణీయం…

– గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి…

– గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…

రాజానగరం,(విశ్వం వాయిస్ న్యూస్):
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎటువంటి అవినీతికి తావు లేకుండా జగనన్న పాలనలో ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.ఆదివారం నాడు రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రజాప్రతినిధులు,అధికారులు,నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు వివిధ పథకాల రూపేణ పొందిన లబ్ధితో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.గడప గడపలో వచ్చిన సమస్యలు పరిష్కరం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం హర్షణీయమని దీనివల్ల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుందని సచివాలయ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు.పాత తుంగపాడు గ్రామానికి చెందిన తమ్మిడి సీతమ్మ వృద్ధాప్యం వలన కళ్ళు సరిగా కనపడటం లేదని, అనేకమార్లు వివిధ ఆసుపత్రిల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయిందని గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఆయన కంటికి సంబంధించి మెరుగైన వైద్య సదుపాయం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచించారు.పాత తుంగపాడు గ్రామానికి చెందిన ప్రజలు, విద్యార్థులు నిత్యం వివిధ కారణాల వల్ల రాజమండ్రి వెళ్తూ వస్తూ ఉంటారని బస్సు సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా అన్ని చర్యలు చేపడతామన్నారు.
పాత తుంగపాడు గ్రామంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపడుతున్నామని, కొన్ని చోట్ల డ్రైనేజీలలో పేరుకుపోయిన మట్టిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.గత ప్రభుత్వానికి,వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలు గమనిస్తున్నారని,ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా,మధ్య వర్తులు లేకుండా,అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వై.ఎస్.ఆర్ సీ.పీ ప్రభుత్వమని గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పట్ల,జగన్మోహన్ రెడ్డి అమలచేస్తున్న సంక్షేమం పథకాల పట్ల ప్రజలలో విశేషమైన స్పందన కనబడుతుందని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వాసంశెట్టి పెద్ద వెంకన్న మందారపు వీర్రాజు,యేరుబండి రాంబాబు,ఉంగరాల గోవిందరాజు,కోలపాటి వెంకన్న,కొల్లి వీర్రాజు,కుందేటి ప్రసాద్,ఉల్లిగ సత్యనారాయణ,కామేశ్వరరావు,బి.రాధ కృష్ణ, జె.సింగరాజు,బి.శివ నాగరాజు,కోనే అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!