Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 6:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 6:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 6:16 AM

ఆంధ్రప్రదేశ్ కు రాజకీయ మార్పు అవసరం.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

నేటి పాలకుల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారుతుంది.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

దోపిడికి చట్టం ముసుగు తొడుగుతున్న ఆంధ్రప్రదేశ్ పాలకులును ఇంటికి సాగనంపాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు రాష్ట్ర ప్రజలను మింగేసే విధంగా వున్నాయని,రాక్షస పాలకులుకు సైతం ఆంధ్రాలో బ్రహ్మ్రరధం పట్టడం చూస్తుంటే మన బిడ్డల భవిష్యత్ ను మనమే తాకట్టు పెడుతున్నట్టుగా వుందని,ఆంధ్రాలో రాజకీయ పరిణామాలు అత్యంత ప్రమాద కరంలో వున్నాయని,రాష్ట్ర విభజన అనంతరం నేటికి
ఏ ఒక్క అభివృద్ధి కి ఆంధ్రులు నోచుకోలేదని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని దోచుకుంటున్న పరిస్థితులను ఆంధ్ర ప్రధాన రాజకీయ పక్షాలు చూస్తు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారని, ఆంధ్ర ప్రధాన రాజకీయ పక్షాల బలహీనతలు ఢిల్లీ పాలకుల ముందు బాంచన్ దొర అంటున్నారని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పక్షాలను ఆంధ్రులు ఐఖ్యత తో రాష్ట్ర సరిహద్దులను దాటించి రాజకీయ ఆపార్టీల చిరునామా ను గల్లంతు చేయాలని,ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్ ను కాపాడుకోవాలని, రాష్ట్రం లోగల ప్రధాన రాజకీయ పక్షాలు ఆంధ్ర లో “చెమ్మ” గాను, ఢిల్లీ లో “చెక్క” గాను నటిస్తు నర్తనశాల పాత్రలు పోషిస్తున్నారని,ఆంధ్ర లో పూర్తి స్థాయి ఆంధ్ర రాజకీయ పార్టీలను ప్రజలు గెలిపించుకున్నప్పుడే రాష్ట్రానికి బంగారు భవిష్యత్ అని, ఆంధ్రప్రదేశ్ లో నూతన తరంతో రాజకీయ నిర్మాణ మార్పు అవసరం వుందని ఆంధ్రులు నమ్మాలని, రాజకీయ మార్పు కై ఉద్యమించాలని ఆయన కోరారు.ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ప్రతిపక్షం బూతులు మాట్లాడటంలోను, విప్పి చూపించటం లోను ఒకరుకు మించిన వారు మరొకరు అన్నట్టు అనుభవజ్ఞులు వున్నారని, వీరి అనుభాలు ప్రజలకు రాష్ట్రానికి కాకుండా వారి అధినాయకత్వం రాజకీయ పగ ద్వేషాలకు ఉపయోగపడుతున్నాయని, వీరి భూతులు గమనిస్తున్న చిన్నపిల్లలు కూడా వీరి బూతులకు అలవాటు పడుతున్నారని, గౌరవ సాంప్రదాయక పదాలు వీరి కారణంగా పిల్లల్లో అంతరించి పోతున్నాయని, నేటి బూతు నేతలు, పాలకులు కుటుంబాలు వీరికి ఇంట్లో భోజనం పెట్టి ఇంట్లో ఉండనిస్తున్నారు అంటే వారి వారి పూర్వికులు,పెద్దల సాంప్రదాయాలను అనుమానించవలసి వస్తుందని, ప్రస్తుత పాలకులు పాలనను గాలికి వదిలేసి దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ప్రధాన రాజకీయ పక్షాల వైఖరికి గ్రామాల్లో ప్రజలు ఆడలిపోతున్నారని, నిత్యం గొడవలు, దాడులను ప్రధాన రాజకీయ పక్షాలు అల్లర్లను వ్యాపారంగా మార్చేసారని, కిరాయి మూకలను ప్రోత్సహిస్తు గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని,నేతల స్వార్థప్రయోజనాలకు యువత భవిష్యత్ ను సర్వ నాశనం చేస్తు పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు బానిసలుగా చేస్తున్నారని, ఆంధ్ర పాలకులు,నేతల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల మెరిట్ హీనస్థితికి చేరుకుంటుందని, రాజకీయ కుట్రలతో ప్రభుత్వ విద్యను పూర్తిగా నీరు గార్చారని, ప్రజలను పన్నుల రూపం లోను, ధరల రూపంలోను దోచుకుంటు పథకాల ముసుగులో అర్హులను సైతం వేధిస్తున్నారని , ఆంధ్రప్రదేశ్ లో బూతులు, రాజకీయ వివాదాలనే పాలనగా శాసిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఆంధ్రప్రదేశ్లో గల పేదరికం కారణంగా ప్రజలు అర్హులను చట్ట సభలకు పంపలేక పోతున్నారని, ప్రస్తుతం చట్ట సభల్లో 85% ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతున్న వారు అంత దోపిడీలకు కెప్టెన్ ల వంటి వారని, ఆంధ్రప్రదేశ్ లో చట్టాలు అమలు జరగటం లేదని, ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలను అధికార స్వపక్ష, విపక్షాలు రాజకీయ అనుబంధ సంస్థలగా నడిపిస్తున్నారని, భారతదేశం లోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చట్టాలు బాధితులకు అండగా నిలువ లేకున్నాయని, న్యాయం, చట్టం ఖరీదైన కార్పోరేట్ వ్యాపారంగా మారి పోయిందని,సంపదను దోచుకుంటున్న వారు పోషక విలువలు గల ఆహారాన్ని భుజిస్తున్నారని, సామాన్యులు నాణ్యత లోపించిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటున్నారని,ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరం వరకు సామాన్య జీవితం గడిపిన కొన్ని కుటుంబాలు సంవత్సరం అనంతరం బ్రతక లేక బిక్షమెత్తుకుంటున్న కుటుంబాలుగా 1%వున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలపై నిరుద్యోగులకు ఆశలు పోయి ఆత్మహత్యలు చేసుకుంటు కుటుంబాలకు ఘోష మిగిలిస్తున్నారని, నేటి ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు సైతం రోజు కూలీల బ్రతుకులుగా మారిపోయాయని, పాలకుల అధికార దుర్వినియోగ చర్యలను ఉద్యోగులు అమలు చేయకపోతే ఆ ఉద్యోగికి తీవ్రమైన వేధింపులు తప్పవని, నేడు మెజార్టీ ఉద్యోగులు ఊడిగమే చేస్తున్నారని, నేటి చట్టాలు అమలు తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారాయని,
నేటి ప్రజా స్వామ్యం కన్నా బ్రిటిష్ నియంత పాలన లో అభివృద్ధి వుందని, మన పాలకుల అవినీతి లోను, అధికార దుర్వినియోగం లోను బ్రిటిష్ వారు సైతం పోటీపడలేరని ఆయన పేర్కొన్నారు.మన పాలకుల కారణంగా ఆంధ్రుల ఖ్యాతి ప్రపంచ స్థాయిలో దిగజారి పోతుందని, మన నేతల అండతో ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకుని పోతున్న ఇతరులు సంపన్నులుగా జీవిస్తున్నారని, ఆంధ్రులు మాత్రం బక్కచిక్కి పోతున్నారని, మన రాష్ట్రం లో నియమించే కమిషన్ లు, ఇతర విచారణలు భాదితుల రక్షణను అవినీతి పరులకు తాకట్టు పెట్టె విధంగా విచారణలు జరుగుతున్నాయని, నేటి వరకు ప్రభుత్వం నియమించిన ఏ ఒక్క కమీషన్ అయినా వాస్తవాన్ని తేల్చగలిగిందా ! పుష్కర మరణాలు కావొచ్చును, విశాఖపట్నం గ్యాస్ లీకేజి ఘటన కావొచ్చును, రాజధాని వివాదాలు కావొచ్చును, పోలవరం నిధులు దుర్వినియోగం కావొచ్చును వీటిపై నేటి వరకు నియమించిన ఏ ఒక్క కమిషన్ అయినా నిగ్గు తేల్చగలిగిందా ! విచారణల ముసుగులో కోట్లాది రూపాయిలు ప్రజా ధనం దుర్వినియోగం చేసారని, దిగువ స్థాయి పౌర సేవలు, పాలకుల అవినీతితో పాలన కలుషితం అయ్యిన కారణంగా పాలనను పూర్తిగా సంస్కరించుకోవాల్సిన పరిస్థితులు ముందుగా ఆంధ్రప్రదేశ్ కు అవసరం అని, ఆంధ్రప్రదేశ్ నుండి తరలి పోతున్న సంపదను కాపాడుకోవటానికి ఆంధ్రులు సమాయత్తం కావాలని, పాలనను సంస్కరించు కుని మెరుగైన పాలనను సాధించుకోవాలని, భద్రత గల సమాజ నిర్మాణమే ఆంధ్రుల ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగాల్సిన తరుణం నేడు ప్రతి ఆంధ్రుడి భుజస్కందాలపై వుందని ఆయన గుర్తు చేసారు.ఆంధ్రప్రదేశ్ లో ఆడ బిడ్డలకు భద్రత లేకుండా పోయిందని, బాధిత మహిళకు, భాదితుల కుటుంబాలకు నేటి వరకు చట్టబద్దమైన న్యాయం జరిగిన ఘటన ఏ ఒక్కటైనా వుందా అని,పసి బిడ్డల నుండి, గృహిణిల వరకు చట్ట బద్దమైన భద్రత, న్యాయ రక్షణ పొందిన ఘటనలు నేటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేకపోతున్నారని , రోజు రోజుకు బీహార్, యుపి, జార్ఖండ్ వలే ఆటవిక పాలనలో మహిళలు అభద్రతా బావంతో జీవిస్తున్నారని, ప్రస్తుతం మహిళా రక్షణ కోసం అమలు చేస్తున్న దిశా చట్టంకు చట్ట భద్రత లేదు, మన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, విజయవాడ లో హాస్టల్ విద్యార్థిని ఆయాషా మీరా ను అత్యంత పాశవికంగా హత్య చేసిన అసలు దోషులను పట్టుకోవటంలో కూడా అవినీతి కి అమ్ముడు పోయిన మన పాలకులును ఆంధ్రప్రదేశ్ విద్యార్థి లోకం క్షమించటం బాధాకరమని, విద్యార్థి అయాషా మీరా ను అత్యంత కిరాతకంగా చంపిన వారిని కాపాడుతున్న పాలకులకు యావత్ విద్యార్థి లోకం సరైన గుణపాఠం చెప్పాలని, ఆయాషా మీరా ఆత్మకు శాంతి చేకూరే ప్రజా తీర్పుకు విద్యార్థి లోకం సిద్దపడి విద్యార్థుల ఐఖ్యత, సత్తాను నేటి పాలకులకు రుచి చూపించాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు.
సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, మార్త ప్రభాకర్, వల్లి శ్రీనివాసరావు,సిమ్మా దుర్గారావు, కారుమూరి శిరీషా, పేరూరి శివ, యర్రా బుల్లయ్య, వనుం సతీష్, మండవిల్లి వెంకటేశ్వరరావు, మండవిల్లి శంకర్, మడవిల్లి సూరిబాబు, రెడ్డి స్వర్ణలత, కోట సుశీల, కె. సత్యనారాయణ,కోట రాజశేఖర్, కంకిపాటి రాజు,కొల్లి వెంగళరావు, మట్టపర్తి తులసి రావు, బసా సోనియా, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, సీరపు నాగేశ్వరి, మాసా అప్పాయమ్మ, అడపా శేషగిరి, మాసా సుభద్ర, గెద్దాడ సుందరి మాసా రాహుల్ తదితరులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!