విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:
తిరుమల స్కూల్ విద్యార్థి లిఖిత్ ప్రతిభకు బంగారు పతకం
– సాప్ట్ బాల్ టోర్నమెంట్ లో జిల్లా కు ప్రధమ స్థానం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
8వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్ బాల్ ఛాంపియన్ టోర్నమెంట్ బాలుర విభాగంలో తూర్పు గోదావరి జిల్లా క్రీడాకారులు ప్రధమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. యానాం లో జరిగిన ఈ సాప్ట్ బాల్ టోర్నమెంట్ లో మొత్తం 13 జిల్లాలు నుంచి క్రీడాకారులు పాల్గొనగా బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో విజయనగరం, తృతీయ స్థానంలో శ్రీకాకుళం జిల్లాలు నిలిచాయి. ప్రధమ స్థానంలో నిలిచిన తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం తిరుమల స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థి కె. లిఖిత్ బంగారు పతకం సాధించి తన ప్రతిభను చాటుకునని నగర ప్రజల అభినందనలు మరియు ప్రశంసలు అందుకున్నాడు.