విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉప్పలగుప్తం మండలం:
త్రాగునీరు వృధాగా పోతున్న
పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
ఉప్పలగుప్తం విశ్వం వాయిస్ న్యూస్.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం,వానపల్లి పాలెం సచివాలయంనకు అతి దగ్గరలో రోడ్డు ప్రక్కన పైపు లైన్ పగిలి త్రాగునీరు గత నాలుగు రోజులుగా వృధాగా రోడ్డుపై నుండి ప్రవహిస్తూ పంట బోదే లోనికి పోవుచున్నది ఉప్పలగుప్తం మండలంలో గల అతి ముఖ్యమైన సమస్య త్రాగునీరు, అటువంటి త్రాగునీరు వృధాగా పోతుంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గానీ సచివాలయం సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదు అధికారులు వెంటనే స్పందించి పగిలిన పైపులైను బాగు చేసి నీటి వృధాను మరియు రోడ్డు కోతను అరికట్టగలరని స్థానిక ప్రజలు కోరుతున్నారు