Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 10:50 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 10:50 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 10:50 AM
Follow Us

అయినవిల్లి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన కొబ్బరి ఆకులతో తయారుచేసిన వినేశ్వరుడు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

అయినవెల్లి ఆలయంలో ఆకర్షణగా నిలిచిన కొబ్బరి ఆకులతో తయారుచేసిన విఘ్నేశ్వరుడు

 

 

అయినవిల్లి విశ్వం వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో స్వయంభుగా వెలసిన ఆలయ ఆవరణలో వినాయక చవితి మహోత్సవ వేడుకల్లో భాగంగా కొబ్బరి చెట్టు మొవ్వు ఆకులతో తయారుచేసిన విగ్నేశ్వరుడి మండపం విఘ్నేశ్వరుడు అయినవిల్లి ఆలయంలో విచ్చేసిన భక్తులకు ఆకర్షణగా నిలిచాడు అయినవిల్లిలో వెలిచిన విగ్నేశ్వరుడు ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి అలాగే దక్షిణాంధ్రలో కాణిపాకం ప్రసిద్ధి అటువంటి అతి పురాతన ప్రాచీనమైన కాలమైన స్వయంభూ గణపతి కోనసీమ జిల్లాలో అయినవిల్లి గ్రామంలో వృద్దగౌతమి నదీతీరం దగ్గరలో వేంచేసి కోనసీమ జిల్లాలో కొంగుబంగారమై విరాజిల్లుతూ ఆయనను దర్శించ వచ్చిన భక్తులు కోరికలను నెరవేరుస్తూ స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది ప్రతి సంవత్సరం వచ్చే మొదటి పండుగ వినాయక చవితి వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా అయినవిల్లి ఆలయం వద్ద పచ్చని పందిళ్లు వేసి కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుత్ అలంకరణతో గుడి ఆవరణ లోపడ రకరకాలపూల తోరణాలతో అలంకరించారు భక్తులు వినాయక చవితి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారిని దర్శించేందుకు క్యూ కట్టారు ఆలయ ప్రధాన అర్చకులు నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మొదటిరోజు బుధవారం నాడు స్వామివారికి అభిషేకాలు పూజ కైంకర్యాలు ,నిర్వహించి స్వామి వారిని భక్తులు సందర్శనార్థం ఆలయ ప్రవేశం చేయించారు ఈ క్రమంలో స్వయంభు స్వామివారిని దర్శించిన భక్తులు బయటకు వచ్చిన తర్వాత ఆలయ ఈవో అధికారులు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో కొబ్బరి చెట్టు మొవ్వు ఆకులతో ఆలయ అధికారులు గుడి ఆవరణలో తయారు చేయించిన వినాయకుడి విగ్రహం, మరియు మండపం, భక్తులను పిల్లలను పెద్దలను ఎంతగానో ఆకర్షించింది అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించడానికి, వైయస్సార్సీపి ఎంపీ చింతా అనురాధ, వైఎస్సార్ సీపీ పార్టీ ఇంచార్జ్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పి .గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు, ఆలయ ఈవో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు నిత్య అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా భక్తులు దూరప్రాంతాల నుంచి అయినవిల్లి స్వయంభు విఘ్నేశ్వరుని దర్శించేందుకు పోటెత్తారు వీరిని పోలీస్ వారు అయినవిల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కార్లు, ద్విచక్ర వాహనదారులును ఖాళీ స్థలాలలో పార్కింగ్ ఏర్పాటు చేసి వచ్చే వారికి వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతో సమన్వయంతో భక్తులు స్వామివారిని దర్శించేందుకు మార్గాన్ని కృషి చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement