Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 5:22 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 5:22 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 5:22 PM

దుండగులు చేతిలో తీవ్ర గాయాలుపాలయిన ముగ్గురు యువకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

స్థానిక పేపర్ మిల్లు సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తుండగా గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు చేతిలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయాలు పాలయ్యారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ క్రైం న్యూస్:

స్థానిక పేపర్ మిల్లు సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తుండగా గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు చేతిలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయాలు పాలయ్యారు.వారి కుటుంబ సభ్యులయిన మాజీ ఎం.పి.పి రేలంగి సత్యనారాయణను వివరాలు అడగగా
బుధవారం సాయంత్రం 5:30 సమయం లో
ద్విచక్రవాహనం పై రేలంగి సతీష్,రేలంగి సత్య శంకర్ వీరు ఇరువురు సతీష్ మేనత్త ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణం దుర్గమ్మ గుడి వద్ద దర్శనం చేసుకుని వీళ్ళు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం తీసుకుని వెళ్తుండగా ఆ దుండగులు ఎ.పి 37 బిడి 6568 గల కారులోంచి దిగి గుర్తు తెలియని 5గురు వ్యక్తులు సతీష్,సత్య శంకర్ పై విచక్షణ రహితంగా దాడి చేసి వారి వద్ద నుండి నగదు,బంగారం,సెల్ ఫోన్ లాక్కుని వారు పరారయ్యారు.జరిగిన సంఘటన వద్దకు స్థానికులు చేరుకుని గాయాలు పాలయిన యువకులను 108 ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.3 వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాము అని అన్నారు. సంఘటనను తెలుసుకుని మాజీ ఉమ్మడి రాష్ట్రాల బి సి కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీను మరియు కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.ఈ సందర్భంగా పాలిక శ్రీను మాట్లాడుతూ చదువుకున్న యువకుల ను అల్లరిమూకలు ఈ సాయంత్రం వీరిపై దాడి జరగడం చాలా బాధాకరం,దాడి చేసిన వారిపై కుటుంబ సభ్యులు పిర్యాదు చేయడం జరిగింది.పోలీసు ఉన్నతధికారులు ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా వారి పై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీను కోరారు.

తీగి రెడ్డి శ్రీనువాస్, మట్ట శ్రీనివాస్,దుర్గారావు మన్యం, రేలంగి సత్యనారాయణ,అత్తిలి శ్రీనివాస్, రేలంగి శ్రీనివాస్ తదితరులు పరామర్శించిన వారు లో ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!