Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 5:41 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 5:41 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 5:41 PM
Follow Us

దమ్ముంటే లోకేష్ ని రాజమండ్రి నుండి పోటీ చేయమనండి – ఎంపీ భరత్ సవాల్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎప్పుడూ పర్యటించిన దాఖలాలు లేవు మరి ఏమయిందో ఏమో వారానికి నాలుగు రోజులు అక్కడే ఉండటం విచిత్రముగా వుంది అని ఏద్దేవా చేశారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:

దమ్ముంటే లోకేష్ ని రాజమండ్రి నుండి పోటీ చేయమనండి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ అన్నారు.స్థానిక మార్గాని ఎస్టేట్స్ లో ఎంపీ కార్యాలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో భరత్ రామ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎప్పుడూ పర్యటించిన దాఖలాలు లేవు మరి ఏమయిందో ఏమో వారానికి నాలుగు రోజులు అక్కడే ఉండటం విచిత్రముగా వుంది అని ఏద్దేవా చేశారు.ఇక ఉత్తరకుమారుని ప్రగల్బాలు పలికే నారా లోకేష్ కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించడం అని ప్రశ్నించడం విడ్డురం గా ఉందని అన్నారు.రామచంద్రారెడ్డి రెడ్డి కాబినెట్ లో మంత్రివర్యులు అని రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు వారికి ఉందని, అది కూడా తెలియడం లేదు, అయిన లోకేష్ కామెడీ మానకుతెలియనిది కాదు.లోకేష్ రాష్ట్రంలో ఎక్కడ నుండి అయినా పోటీ చేస్తాను అనడం ఎక్కడో ఎందుకు రాజమండ్రి నుండి ఎంపీ గానో, ఎమ్మెల్యే గానో పోటీ చెయ్యండి మా సత్తా ఏంటో చూపిస్తాము అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు.ఈ మూడు సంవత్సరాలలో రాజమండ్రి శాసన సభ్యులు ఏమి చేశారు అసలు ,మేము చేసిన కొన్ని అభివృద్ధి పనులు మచ్చుకకు చెప్తాము మోరంపూడి ఫ్లై ఓవర్,
కొత్తగా ఏర్పడబోయే 52 వార్డ్ లకు ఒక్కో వార్డ్ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నాము,సెంట్రల్ కూరగాయల మార్కెట్ స్థలాన్ని షిఫ్ట్ చేస్తాం,గోదావరి నది ప్రక్షాళనకు మొదటి విడతగా 88 కోట్లు మంజూరు,క్రికెట్ గ్రౌండ్, ఇండోర్ స్టేడియం శంకుస్థాపన 18 నెలలో పూర్తి చేసి ప్రజలకు, క్రీడాసక్తి వున్న యువతకు అందుబాటులోకి తీసుకుని వస్తాం,హితకారిణి సమాజం లో సుమారు 10000 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వారికి నాడు నేడు కింద ఉన్నత స్థాయి విద్యను మంచి ప్రమాణాలతో అందించేందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో విలీనం చేశాము. అక్కడ పని చేస్తున్న ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేశాము.గోదావరిహారతి పునఃప్రారంభం జరిగింది,రాజమండ్రి నగర రోడ్లను అభివృద్ధి చేశాము, చేస్తున్నాము,మోరంపూడి ఫ్లై ఓవర్ 18 నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తాము.ఇలా అభివృద్ధి చేస్తున్నాము అది చూసి మాకు సహకరించాలి గాని వీళ్లకు ఎదుటి వ్యక్తిని విమర్శించడం తప్ప ఇంకోటి చేతకాదు..
మన రూరల్ ఎమ్మెల్యే వారు మంజూరు చేసినవి మేము చేస్తున్నామట… అయ్యా తమరు దయవుంచి సమగ్రముగా తెలుసుకుని అప్పుడు మాట్లాడండి ఒకవేళ మీరు మంజూరు చేసిన మోరంపూడి ఫ్లైఓవర్ మేము కాన్సల్ చేసి మరల తీసుకుని వచ్చినట్టు రుజువు చేస్తే నేను బహిరంగముగా మీకు క్షమాపణలు చెపుతాను లేకపోతే మీరు చెపుతారా అని సవాల్ విసిరిన ఎంపీ భరత్.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, గాండ్ల తెలికుల కార్పొరేషన్ చైర్మన్ భవానీ ప్రియ, ఖాదీ బోర్డు కార్పొరేషన్ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీనివాస్, ఆర్యపురం బ్యాంకు డైరెక్టర్లు, హితకారిణి సంస్థ డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డ్ ఇంచార్జిలు, వివిధ సెల్స్ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement