విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
స్థానిక భాస్కర్ నగర్ లో గల మన్నా చర్చ్ నందు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న 40 మంది అంధ నాయకులకు నాయకత్వ తర్ఫీదు కార్యక్రమం ప్రేమజీ మని కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాశీ నవీన్ కుమార్ ప్రవీణ్ కుమార్ లు ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాశి నవీన్ కుమార్ మాట్లాడుతూ అంధత్వాన్ని దేవుని వాక్యం ఆత్మీయతలతో అధిగమించి నాయకులుగా ఎదగాలని అన్నారు. ఏసుక్రీస్తు జీవితంలోని ప్రేమని త్యాగాన్ని భౌతిక నేత్రాలతో కాకుండా ఆత్మీయ నేత్రాలతో మాత్రమే చూడగలమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మన్నా చర్చ్ పాస్టర్ విల్సన్, సాన్డిస్క్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీధర్, సీయోను చర్చ అబ్రహం, న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ చర్చి పాస్టర్ జియోల్ రాజు పాల్గొన్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక గీతాలకు రవిశంకర్ సంగీతం సమకూర్చారు. పాల్గొన్న వారికి బహుమతుల ప్రధానోత్సవం చేశారు. చివరగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంధ నాయకులకు ముఖ్య అతిధులచే బహుమతుల ప్రధానోత్సవం చేశారు.