Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 2:18 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 2:18 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 2:18 PM
Follow Us

పేదవాడి ఆకలి తీర్చే పథకం పక్కదారి పడుతున్న పట్టించుకోని రెవెన్యూ అధికారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

పేదవాడి ఆకలి తీర్చే పథకం పక్కదారి పడుతున్న పట్టించుకోని రెవెన్యూ అధికారులు

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జోరుగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమం గా మిల్లర్లకు తరలింపులు రెండు నెలల క్రితం రావులపాలెం, ముమ్మిడివరం, మామిడి కుదురు కాట్రేనికోన మండలాలలో అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాలను పోలీస్ వారు పట్టుకుని కేసులు నమోదు చేసిన అక్రమం గా రేషన్ బియ్యం తరలించే ముఠా మాత్రం ఎటువంటి బెరుకు లేకుండా జోరు గా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు పేదవాడి ఆకలి తో పస్తులు ఉండకూడదని స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి కిలో ఒక్క రూపాయికే బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేశారు అటువంటి మహత్తర పథకం ద్వారా ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి తరలిపోతున్న రెవెన్యూ అధికారుల యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తుంది ప్రతినెలా చౌక దుకాణాల ద్వారా ఇచ్చే రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసేవారు ప్రజల దగ్గర నుంచి కిలో 15 రూపాయలకు తీసుకుని వాటిని పాలిష్ పెట్టి తిరిగి అక్రమంగా మిల్లర్లకు తరలిస్తూ అధిక ధనాన్ని సంపాదిస్తున్నారు ఈ క్రమంలోనే గురువారం నాడు అక్రమంగా ట్రాక్టర్ పై తరలిస్తున్న రేషన్ బియ్యం లోడును కాట్రేనికోన పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు గత కొంతకాలంగా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని పాలిష్ పెట్టి ఆటోల ద్వారా ట్రాక్టర్ ద్వారా మిల్లర్లకు సరఫరా చేస్తూ అధికారుల కళ్ళుగప్పి రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యాపారాన్ని కందికుప్ప గ్రామానికి చెందిన విత్తనాల విష్ణుమూర్తి అలియాస్ పెద్ద బుజ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కందికుప్ప నుంచి మురుమళ్ళ వెళ్తున్న రేషన్ బియ్యం తో కూడిన ట్రాక్టర్ ను కాట్రేనికోన పోలీసు వారు కుండలేశ్వరం వద్ద పట్టుకోవడంతో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది పట్టుకున్న ట్రాక్టర్ లో సుమారు గా మూడు టన్నులు రేషన్ బియ్యం మూటలు ఉన్నట్లు పోలీస్ వారు అదుపులో కి తీసుకున్న ట్రాక్టర్ డ్రైవర్ ను విచారించగా కందికుప్పకు చెందిన విత్తనాల విష్ణుమూర్తి కి చెందినదిగా సదరు ట్రాక్టర్ డ్రైవర్ పోలీసులకు తెలపడంతో ఎంతోకాలంగా రేషన్ బియ్యం మిల్లులకు సరఫరా చేస్తున్నా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాట్రేనికోన మండలంలో ఇంత తతంగం జరుగుతున్న రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని మండలంలోని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు

 

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement