Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 3:58 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 3:58 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 3:58 AM
Follow Us

మహానేత డా.వైయస్సార్ కు వైకాపా శ్రేణుల ఘన నివాళి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మహానేత డా.వైయస్ రాజశేఖరునికి ఘనంగా నివాళులు
– ఎటపాక మండలంలో వై.ఎస్.ఆర్ 13వ వర్ధంతి కార్యక్రమం
– గ్రేస్ అనాధ వృద్దాశ్రమంలో రొట్టెలు , పండ్లు పంపిణీ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

జనహృదయాల్లో గూడు కట్టుకున్న మహానేత , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపు మేరకు ఎటపాక మండల కేంద్రంలో వైకాపా జిల్లా నాయకులు , మండల సమన్వయ కమిటీ సభ్యులు కురినాల వెంకటేశ్వర్లు (బుజ్జి) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వై.ఎస్.ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. మండల పరిధిలోని రాజుపేటలో మహానేత డా.వై.ఎస్.ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి , పూలమాలలు వేసి నాయకులు , కార్యకర్తలు , అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రేస్ అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు రొట్టెలు పండ్లు పంచిపెట్టారు. అనంతరం ఎటపాకలో జరిగిన కార్యక్రమంలో వైకాపా జిల్లా నాయకులు కురినాల వెంకటేశ్వర్లు (బుజ్జి) , యువజన నాయకులు గొల్లపల్లి శివబాబు మాట్లాడుతూ జనం గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర డా.వై.ఎస్.ఆర్ వేసుకున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను , వాగ్దానాలను అమలు చేయడంలో ఎంతో నీతినిజాయితీతో , నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి వై.ఎస్.ఆర్ అని వారు కొనియాడారు. రాజన్న అంటే ఒక ఆత్మీయ పలకరింపు అని , అంతకు మించి ప్రతీ కుటుంబానికి ఓ పెద్ద దిక్కు అని పేర్కొన్నారు. అలాంటి మహానేత పార్టీ కార్యకర్తలను , అభిమానులను తీరని శోకసంద్రంలో ముంచివేసి తిరిగిరాని లోకాలకు తరలిపోయి నేటికి 13 ఏళ్ళు గడిచి పోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి సేవలను , ఆయన అమలు చేసిన పథకాలను నాయకులు , కార్యకర్తలు అందరూ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి బాటలో తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఒక్కసారి మాట ఇస్తే మడమ తిప్పని నేతగా ప్రజలకు నవరత్నాలను ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం నాయకులు సంతపూరి వెంకటేశ్వర్లు (నాని) , పప్పుల సర్వేశ్వరరావు (సర్వే) , కురినాల విజయ్ , గజ్జల నాగరత్నం , పుట్టి సంపత్ , చెలికాని సురేష్ , గజ్జల ప్రసాద్ , చెలికాని శివ , కుచ్చలపాటి వెంకటేశ్వర్లు , గంధం నవీన్ , కుచ్చలపాటి దుర్గారావు , డేగల శివ , కుచ్చలపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement