Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

ఆడ పిల్లను వీధిన పడేస్తారా..?

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

దిగజారిపోయిన జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్.
– స్టాలిన్‌పై మండిపడ్డ బాధితురాలు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కడియం:

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్ :

కడియం మండలం జేగురుపాడు సర్పంచ్ వైసీపీ రూరల్ మండల నాయకుడు దిగజారి పోయాడని బాధితురాలు గుడిపే మాధవి మండిపడ్డారు.తాను ఒక ఆడ పిల్లననీ కూడా చూడకుండా జేగురుపాడు సర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ రూరల్‌ మండలం ముఖ్య నాయకుడు స్టాలిన్‌ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వీధిన పడేశారని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. రాజమహేంద్రవరం స్థానికంగా ఉన్న సుబ్రహ్మణ్యం మైదానం వద్ద మీడియాతో మాట్లాడుతూ తాను 2019లో గుడుపు యువరాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అన్నారు. తాగుడు, గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడ్డ యువరాజు తనను నిత్యం వేధిస్తుండడంతో, తను ఆరు నెలలు గర్భిణిగా ఉన్నప్పుడు కాలితో కిరాతకంగా త న్నడంతో గర్భస్రావానికి గురయ్యానని, అదన కట్నం కావాలని వేధింపులకు గురి చేయటంతో అతనిపై విరక్తి కలిగి వేధింపులు తాళలేక కడియం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి రెండేళ్లగా అతడితో విడిపోయి తన కుటుంబంతో జీవిస్తున్నానన్నారు. తరచూ వేధించటంతో ఈ మేరకు యువరాజుపై కేసు వేయడం జరిగిందన్నారు. యువ రాజుతో రాజీ పడాలని జేగురుపాడు సర్పంచ్‌ స్టాలిన్‌ తనపై ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. ఆయన మాట వినకపోవడంతో కొంతకాలంగా తనను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రెండు రోజుల క్రితం స్టాలిన్‌పై కేసు పెట్టేందుకు కారులో పోలీసు స్టేషన్‌కు వెళుతున్న తనను, మరొక వ్యక్తిని రోడ్డు అడ్డగించి దుర్భాషలాడి తమపై దాడి కి ప్రయత్నం చేశారన్నారు. ఆడ పిల్లనని కూడా చూడకుండా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తామోదో గదిలో ఉంటే స్టాలిన్‌ ఆయన అనుచరులు పట్టుకున్నామన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. స్టాలిన్‌పై తాను కేసు పెట్టేందుకు పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారలు, మీడియా తనకు సహకరించి న్యాయం చేయాలని కోరారు. తాను అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియాలో ఇష్టానుశారంగా ప్రచారం చేస్తున్నారని,స్టాలిన్ పై కంప్లైంట్ చేయడానికి అధికారుల దగ్గరికి కారులో వెళుతుండగా అది తెలుసుకున్న స్టాలిన్ ఇలా చేసాడు..

నీవు చేసిన పనికి నేను బతికి ఉన్న శవంతో సమానం…

నీకు ఇంట్లోనీ ఆడవారు ఉన్నారు కదా?
రోడ్డు పై ఎటు వెళ్లకుండా నిలబెట్టి పదిమంది తో వీడియోలు తీస్తావా! ఎంత అవమానకరమైన విషయం ఇది మీకు అర్థం కాలేదా? నీవు పైగా సర్పంచ్ వా?లాయర్ అని కూడా చెప్పుకుంటున్నావు! ఒక ఆడ మనిషి నీ నీచాతి నిచంగా అంతమందిలో బూతులు తిడుతుంటే అక్కడ ఉన్న పోలీసులు ఆపకుండా చోద్యం చూస్తున్నారు వారే సాక్ష్యం నాకు పై లేనిపోని ఆరోపణ వేస్తూ నాకు అక్రమ సంబంధం సంబంధం అంట కడతావా? నీవు గదిలోకి దూరి ఏమైనా చూశావా చూస్తే నీ దగ్గర వీడియోలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే బయట పెట్టు నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. లేదంటే నీపై నేను కూడా మీ కుటుంబ సభ్యులు విషయాలు మాట్లాడవలసి వస్తుంది.
నీవు ఏమైనా రాజకీయంగా ఎదగాలంటే ఇంత నీచంగా ఒడికట్టక్కర్లేదు ఆధారలు లేని ఆరోపణ చేస్తూ మండలంలో కొందరిపైన బురద జల్లి ధర్నాలు చేసి డబ్బు డబ్బు చేసుకోవడం నీకు బాగా అలవాటని చాలా మంది అనుకుంటున్నారు.

పోలీసు వారు ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఉన్నారు

ఇప్పటికీ నాకు అవమానంగానే ఉంది ఏ టైం లో ఏం జరుగుతుందో నాకు నేను చెప్పలేను ఈ విషయం జ్ఞాపకం వచ్చి రాత్రులు నిద్ర ఉండడం లేదు ఆకలి ఉండటం లేదు.వాడు చేసిన పనికి మాలిన పనికినేనుఇంకాబతికున్నానంటే నాకే జీవితంపై ఇంకా బతికున్నాన అని మనసులో అనిపిస్తుంది అని ఆవేదన చెందింది. నేను మొఖం జనాలకి ఏ విధంగా చూపించుకో గాలను .మచ్చ వేసే ముందు అవునా కాదా? అని పదిసార్లు ఆలోచించాలి కనీసం ఆలోచించవా నీ కు జ్ఞానం ఉంటే ఓ మహిళలను పట్టుకుని ఈ విధంగా అంతామందిలో నీచమైన బూతులు మాట్లాడతావా. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో పెట్టవు.

,,నాకు న్యాయం చేయండి,,

మహిళా మండలి .మరియు వైయస్సార్ ముఖ్య నాయకులు .పోలీస్ అధికారులు. మీడియా మిత్రులు స్పందించి నాకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను.ఈ విషయంపై రాజకీయ నాయకులు కాళ్లు పట్టుకుంటున్నాడుఅని తెలిసింది . రాజకీయ నాయకుల్లారా!వీడిని క్షమించ వద్దు మీరు పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేయవద్దు వీడిని వీడు ఎన్నో సంవత్సరాలుగా అనేక విషయాలపై చాలామందిని ధర్నాలు చేసి మానసిక గా బాధపెట్టి సొమ్ము చేసుకుంటాడని అర్థమైంది.ప్రజలకూడాచెప్పుకుంటున్నారు.స్టాలిన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగుతానని మాధవి హెచ్చరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!