Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశాఖ జిల్లాలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

అనకాపల్లి, విశ్వం వాయిస్ న్యూస్ :

అనకాపల్లి జిల్లా స్థానిక కోడూరు గ్రామంలో బ్రైట్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోడూరు సచివాలయం విద్య మరియు సంక్షేమ కార్యదర్శి ఆదిత్య మరియు సంస్థ కార్యదర్శి తాతపూడి జయశ్రీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయని వీటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్వయం ఉపాధి కల్పన దశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాలను ప్రజలకు సంక్షేమం అమలు అవుతున్నాయి అని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ప్రజా సంక్షేమం కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్య కానుక, జగనన్న చేయూత, జగనన్న తోడు, వైయస్సార్ రైతు భరోసా, జగనన్న నేస్తం, జగనన్న ఆసరా, వైయస్సార్ గృహ నిర్మాణ పథకం , తదితర సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల కోసం అమలు జరుపుతున్నట్లుగా ఆయన వివరించారు.ఈ పథకాల అన్నింటికీ సంబంధించిన విధి విధానాలను వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని వాటి విధివిధానాలను తెలుసుకొని అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు కల్లా శివశంకర్, సచివాలయం సంక్షేమ విద్య కార్యదర్శి ఆదిత్య, సంస్థ సభ్యులు సిహెచ్ ప్రదీప్ కుమార్, బి బి వి ప్రసాద్,పి వి కిరణ్మయి, కె రమేష్ బాబు,సుధా, స్థానిక ప్రజలు సామాజికవేత్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!