Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 6:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 6:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 6:16 AM

వైరల్‌ ఫీవర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి – ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సూచన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

  • టాగ్స్
ప్రస్తుతం నగరంలో టైఫాయిడ్‌ వంటి వైరల్‌ ఫీవర్ల అధికంగా నమోదు అవుతున్న నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ సూచించారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:

రాజమహేంద్రరం, విశ్వం వాయిస్ న్యూస్

ప్రస్తుతం నగరంలో టైఫాయిడ్‌ వంటి వైరల్‌ ఫీవర్ల అధికంగా నమోదు అవుతున్న నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ సూచించారు.ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.ఇదే విషయమై నగర పాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో మాట్లాడడం జరిగిందని, కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ప్రజాలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు సూచించిన సలహాలు సూచనలు తప్పని సరిగా పాటించాలన్నారు.నిత్యం ప్రజలకు పంపిణీ చేసే మంచినీటిని సక్రమంగా శుద్ధి చేసి సరఫరా చేయాలని హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వారికి సూచించామన్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని, అలాగే వైద్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగర పాలక సంస్థ దోమల నివారణ చర్యలు చేపట్టాలని, నిత్యం పారిశుద్య నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రజలు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!