Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 8:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 8:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 8:16 AM

రేషన్ కార్డులు లో లబ్ధిదారుల వివరాలు మార్చేందుకు నో ఛాన్స్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

రేషన్ కార్డుల్లో లబ్దిదారుల వివరాల మార్పుకు నో చాన్స్

 

 

– వివరాల సమతుల్యం లేదని సంక్షేమ ఫలాల తిరస్కరణ

 

– పింఛన్లు ఆగిపోయి వేలాది మహిళల బ్రతుకులు అస్తవ్యస్తం

 

– వివరాల మార్పు ప్రక్రియ వెంటనే చేపట్టాలని డిమాండ్

 

-కార్డుల ఏరివేత ప్రక్రియ ను తాత్కాలికంగా ఆపాలి

 

 

 

అమలాపురం, కాకినాడ, రాజమహంద్రవరం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్: ఆగస్టు 2019 నుండి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు పథకం రాష్ట్రం లో ఘనంగా అమలయ్యింది. జాతీయ ఆహార భద్రతా పధకం కింద వివిధ రాష్ట్రాలు జారీ చేసిన రేషన్ కార్డులు ఇంతవరకు ఆయా రాష్ట్రాలలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి కాగా ఇప్పుడు సదరు పథకం కింద దేశంలో ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకుని వెళ్ళే వెసులుబాటు కల్పించడం ఈ పధకంలో ఒక ముఖ్య ఉద్దేశ్యం.. దేశంలో వివిధ గ్రామాల నుంచి పట్టణాలకు , ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్ళే వారి సంఖ్య రమారమి అయిదు కోట్లు జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ ఒక అధ్యయనంలో తేల్చింది. ఇటువంటి వారి కోసం జాతీయ స్థాయిలో రేషన్ కార్డులలో పోర్టబిలిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పధకంలో కొన్ని కీలక మార్పులు చేసింది.కార్డులు ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేందుకు వీలుగా క్యూ ఆర్ కోడ్లను ముద్రించడం, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం, స్థానిక భాషతో పాటు వినియోగదారుల వివరాలను ఆంగ్లం , హిందీ భాషలలో ముద్రించడం జరుగుతుంది.

 

ఈ రేషన్ కార్డులపై వుండే 10 అంకెల గుర్తింపు సంఖ్య వివరాలు జాతీయ స్థాయిలో ఒక సెంట్రల్ సర్వర్ లో భద్రపరచడం వలన దేశంలో ఎక్కడి నుండైనా వివరాలు చూసేందుకు అవకాశం కలుగుతుంది. అయితే ఈ పధకం అమలులో రేషన్ కార్డులలో అదనపు వివరాలు జత చెయ్యడం లేదా తీసివెయ్యడం, పేర్ల మార్పు వంటి సౌలభ్యం కల్పించకపోవడం వలన పధకం లో కొంత భాగం మాత్రమే ఉపయోగకరమయ్యిందని చెప్పవచ్చు.

 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేషన్ కార్డులు సమస్య ఎక్కువగా ఉంది.. కార్డుల జారీ సమయంలో లబ్ధిదారుల వివరాలు తప్పుగా నమోదు అయిన సందర్భంలో వాటిని ప్రస్తుతం మార్చే అవకాశం లేదని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఆధార్ కార్డుతో వివరాలు సరితూగ లేకపోతే, రేషన్ షాపు నిర్వాహకులు వారికి రేషన్ ఇవ్వ నిరాకరిస్తున్న సందర్భాలు కోకొల్లలు. మా తప్పు లేకపోయినా, మాకు రేషన్ ఇవ్వడం నిరాకరించడం ఎంతవరకు సబబని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

అలాగే కొందరు భార్యాభర్తలు విడిపోయిన తర్వాత కూడా ఆయా రేషన్ కార్డు లో ఉండటం వల్ల ఇటు భార్యకి అటు భర్తకి ఇబ్బందులు కూడా ఏర్పడడంతో ఆయా పనుల నిమిత్తం రేషన్ కార్డులు మోడిఫికేషన్ చేయాలంటే ప్రస్తుతం జిల్లాలో డెత్ ఆప్షన్ తప్ప ఇతర డైవర్స్ కానీ, యాడింగ్ స్లిప్ట్ ఆప్షన్ కానీ లేకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పలువురు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

 

అట్లే ఒంటరి మహిళలుగా ప్రభుత్వ రికార్డులలో నమోదు అయ్యి, నెలసరి పించన్లు తీసుకుంటున్న వారికి, ఈ మధ్య రికార్డు వెరిఫికేషన్ ప్రక్రియలో వారి రేషన్ కార్డులో భర్త పేరు కూడా నమోదై ఉండడం వలన, రెండు రికార్డులలో అసమానతలు వున్నాయన్న సాకుతో వారి నెలసరి పింఛన్ ను ఏకపక్షంగా అధికారులు నిలిపివేశారు. రేషన్ కార్డు వివరాలు సరి చే సుకోమని సచివాలయ సిబ్బంది సలహా ఇస్తుండగా ప్రస్తుతం అటువంటి సౌలభ్యం రాష్ట్రంలో ఎక్కడా లేకపోవడం ఇటువంటి మహిళలకు శాపంగా మారింది.

 

ఇక దసరా లోపల రికార్డుల వెరిఫికేషన్ చేపట్టి, వివరాలు అసంబద్ధంగా వున్న రేషన్ కార్డు తొలగింపు జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ప్రకటన ప్రజల్లో గుబులు రేకెత్తిస్తోంది. పైన పేర్కొన్న విధంగా, డైవర్స్ కేసులలో లేదా తప్పు వివరాలు నమోదు అయిన కార్డుల విషయంలో వివరాలు మార్పు చేసుకునే సౌలభ్యం రాష్ట్రంలో ఇంతవరకు అమలులో లేదు. పై సాకుతో తమ కార్డులను తొలగిస్తే తమకు దిక్కెవరని అసంఖ్యాక మహిళలు వాపోతున్నారు.

 

కాబట్టి ప్రభుత్వం ముందుగా కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ముందుగా రేషన్ కార్డులలో తప్పుడు వివరాలు సరిదిద్దడం, పేర్లు తొలగింపు లేదా చేర్చడం లాంటి ప్రక్రియ ముందు పూర్తి చేయాలి. బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియ ఆ తర్వాతే చేపట్టాలి. లేకుంటే మొత్తం ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగి, లక్షలాది కుటుంబాలకు తీరని అన్యాయం సంభవించడం ఖాయం.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!