Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 11:11 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 11:11 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 11:11 AM
Follow Us

ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

 

పి. గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్) మండలంలోని లంకల గన్నవరం గ్రామం 4వ వార్డులో కొలువుదీరిన శ్రీ యువ బాల గణపతి స్వామి వారి వినాయక చవితి మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన స్వామివారి లడ్డు వేలంపాటలు హోరాహోరీగా సాగాయి. ఈ మేరకు స్వామివారికి సమర్పించిన నాలుగు లడ్డూలను, స్వామి వారి మెడలో వేసి అలంకరించిన కరెన్సీ నోట్ల దండను, భక్తులు విరాళాలు సమర్పించిన హుండీని వేలం పాటలో పెట్టారు. ఈ మేరకు స్వామివారి 1వ లడ్డును అడ్డగళ్ళ నాగేశ్వరరావు రూ.21,000, 2వ లడ్డును యర్రంశెట్టి వెర్రియ్య(రావుల పాలెం) రూ.11,060, 3వ లడ్డును రావూరి బాలాజీ (రామరాజు లంక) రూ.12,500, 4వ లడ్డు అంబటి నాగేశ్వరరావు రూ.3,100 లకు దక్కించుకున్నారు. అదేవిధంగా కరెన్సీ నోట్ల దండను చిట్టాల చిట్టి బాబు రూ.4,000, హుండీని యర్రంశెట్టి వెర్రియ్య రూ.28,000 వేలం పాట పాడుకున్నారు. అదేవిధంగా ఉత్సవాలకు వినియోగించిన వివిధ రకాల సామగ్రిని వేలంపాట పెట్టగా రూ.5,120 లకు పలువురు పాడుకున్నారు. వేలంపాటలో లడ్డూలను పాడుకున్న భక్తులను ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించి, మేళతాళాల నడుమ వారిని ఇంటికి సాగనంపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement