విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
భాజపా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ శిక్షణ కార్యక్రమం
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్య కార్యకర్తల శిక్షణ శిబిరం ఈరోజు అమలాపురం జిల్లా అధ్యక్షులు కర్రీ చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమం అనగా ఈనెల 17వ తారీకు నుండి అక్టోబర్ రెండో వ తారీకు వరకు జరుప తలపెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కి వక్తలు ఏ విధంగా తయారు కావాలి, ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే అంశం పై రాష్ట్ర నాయకులు శ్రీనివాసు వర్మ ముఖ్య అడితిగా పాల్గొని సూచనలు, సలహాలను స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కార్యదర్శులకు, సహాయ కార్యదర్శులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు మోకా వెంకట సుబ్బారావు, అడబల సత్యనారాయణ, వల్లభనేని రవీంద్ర, దూడల సంకర నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బత్తుల లక్ష్మీ కుమారి, సీనియర్ నాయకులు ఆర్ వి నాయుడు, కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆకుమర్తి బేబీ రాణి, ఎస్సీ మోర్చ జోనల్ ఇంచార్జ్ దూరి రాజేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు విల్ల దొరబాబు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షుడు అయ్యల భాష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు