Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 6:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 6:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 6:16 AM

ఎస్సీ ఎస్టీ వర్గాల హక్కులు కాపాడండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

*ఎస్సీ, ఎస్టీ, వర్గాల హక్కులు కాపాడేందుకు*

 

*పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరిన కలెక్టర్ హిమాన్సు శుక్లా*

 

అమలాపురంవిశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం సెప్టెంబర్ 17

ఎస్సి, ఎస్టి వర్గాల హక్కులు, పరిరక్షణ కొరకు ఏర్పాటైన చట్టాల పటిష్ట అమలుకు పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హీమాన్సు శుక్లా కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశహాలు లో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అధ్యక్షతన జరిగిన ఎస్సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ రెండవ సమావేశం నిర్వహించారు, ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసుల విచారణ, బాధితులకు పరిహారాల పంపిణీ పురోగతిపై క్షుణ్ణంగా కేసులు వారీగా సమీక్షించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పరిష్కార సరళిలో అధికారులకు పూర్తి స్పష్టత ఉండాలని అదేవిధంగా పూర్తి సమాచారంతో సమీక్షలకు హాజరుకావాలని సంబంధిత అధికారులు ఆదేశించారు ఈనెల 30వ తేదీన జిల్లాలోని అన్ని కేసులపై సమగ్ర సమాచారంతో అధికారులు హాజరుకావాలని స్పష్టం చేశారు. వివిధ సంక్షేమ శాఖలు ఎస్సీ ఎస్టీల సబ్ ప్లాన్ , ప్లాన్ ప్రకారం ఇప్పటివరకు వెచ్చించిన నిధులు వినియోగంపై ఆయన ఆరా తీశారు. పౌరు లందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించే రాజ్యాంగ మౌలిక స్పూర్తి కనుగుణంగా ఏర్పాటైన ప్రత్యేక చట్టాలను అధికారులు పటిష్టంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించారు. అలాగే సామరస్యమైన పౌర జీవనాన్ని పెంపొందించేందుకు ఈ చట్టాల గురించి అన్ని వర్గాల ప్రజలకు సమగ్రమైన అవగాహన కల్పించాల్సిన కనీస బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. ఎస్సి, ఎస్టి అట్రాసి కేసుల విచారణ వేగవంతం చేసి బాథితులకు సత్వర న్యాయం, పరిహారం అందించాలని కోరారు. దోషులకు తప్పనిసరిగా శిక్షపడాలని, అలాగే ప్రేరేపిత కేసులతో చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని, అదే స్పూర్తితో విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ అధికారులు ప్రయోజనకరమైన, నిర్మాణా త్మకమైన సూచనలు, సమీక్షలతో ఎస్సి, ఎస్టి వర్గాల రక్షణ, వారికి ఉన్న హక్కుల పరిరక్షణకు పని చేయాలని కోరారు. అలాగే జిల్లాల వ్యవస్థీకరణలో భాగంగా క్రొత్తగా వచ్చిన అధికారులు చట్టాల అమ లులో ఖచ్చితంగా వ్యవహరిం చాలని కోరారు. జిల్లాల పునర్వి భజన కారణంగా నూతన విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు భవిష్యత్తులో నిర్వహించబోయే మానిటరింగ్ కమిటీకి హాజరవు తారని, అయితే నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలల కొకసారి కమిటీ సమావేశాలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఇకపై నిర్వ హించడం జరుగుతుందన్నారు. కమిటీ సభ్యుల నియామక ప్రక్రియ త్వరలోనే పూర్తికానుందన్నారు అనంతరం ఎస్సి, ఎస్టి కేసుల ఇన్వెస్టిగేషన్ ప్రగతి, కోర్టు కేసులపై విచారణ బాధితులకు పరిహారం అంశాలపై పోలీస్, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షిం చారు. షెడ్యూల్ కులాలు మరియు తెగల అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులను సత్వరం పరిష్కరించే దిశగా కృషి చేయా లన్నారు పౌర హక్కుల రక్షణ ఎస్సీ ఎస్టీలపై దురాగతాల నివారణ చట్టం అమలు పై జిల్లా అప్రమత్తత పర్యవేక్షణ అధికారులు ఆయా వర్గాల రక్షణ అంశాలపై చర్చిం చారు. ఎస్టీ, ఎస్టీ అత్యాచారాల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయ, పోలీస్, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసా రించాలని అన్నారు. నిజమైన బాధితులకు న్యాయం జరిగిన ప్పుడు ఈ చట్టం ముఖ్య ఉద్దేశం నెరవేరుతుందన్నారు. కేసులు సత్వర విచారణకు అవసరమైన చార్జిషీటు దాఖల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాల న్నారు. అదేవిధంగా ఆయా కేసులకు సంబంధించి జారీ చేయవలసిన కుల ధ్రువీకరణ పత్రాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కేసు రిజిస్టరయి 60 రోజులు దాటిన చార్జిషీటు దాఖలు కానీ కేసుల వివరాలను ఆయన వాకబు చేశారు. ఎస్సీ, ఎస్టీల ద్వారా నమోదైన కేసుల సత్వర విచార ణకు ఉద్దేశింపబడిన ప్రత్యేక కోర్టులో కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవా లన్నారు. జిల్లాలో డివిజన్ స్థాయిలో నమోదైన అట్రాసిటీ కేసులు ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ప్రతి నెల 30వ తేదీన పౌర హక్కుల దినోత్సవ సమా వేశాలను తప్పనిసరిగా నిర్వహిం చాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పట్ల ప్రజల్లో పరిపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని డివిజన్ల వారీగా ఎస్సీ ఎస్టీ కేసులు పరిష్కార పురోగతిని ఆయన సమీక్షించారు.జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2019 సంవ త్సరం నుండి ఇప్పటివరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం డివిజన్లో మొత్తం 101కేసులు రిపోర్టు అయ్యాయని, వీటిలో ఎఫ్ఐఆర్ దశలో రూ.29,45,000 పరిహారంగా ఇప్పించగా చార్జిసీటు దశలో రూ.20,42,500 పరిహారంగా అందించడం జరిగిందన్నారు . రామచంద్రపురం డివిజన్లో మొత్తం 45 కేసులు నమోదు కాగా ఎఫ్ఐఆర్ స్టేజిలో రూ.11,50.000 పరిహారంగా, చార్జిసీటు దశలో రూ.10, 50,000 పరిహారంగా అందించామన్నారు. కొత్తపేట డివిజన్లో మొత్తం 65 కేసులు నమోదు కాగా ఎఫ్ ఐ ఆర్ దశలోరూ.19, 20.000 పరిహారంగా చార్జి సీటు దశలోరూ 13,50,000 పరిహారంగా అందించినట్లు తెలిపారు. కొన్ని కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు జిల్లా స్థాయి అధికారులు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!