Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

*విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి*

 

*జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర, ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు*

 

విశ్వం వాయిస్ న్యూస్ :-

 

అమలాపురం సెప్టెంబర్ 17

 

ఎంతటి విపత్తు ఎదురైనప్పటికీ ఎదుర్కొనేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు సర్వ సన్నద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర సంబంధిత జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సైక్లోన్ మిడిగేషన్, సన్నద్ధత పై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను హెచ్చరికలు అనుగుణంగా తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకొని ప్రభుత్వపరంగా కల్పించే పునరావాస శిబిరాలలో తలదా చుకోవాలని సూచించారు. రెవిన్యూ శాఖ ముందుగా తీరప్రాంత గ్రామా ల్లో ఉన్న పునరావాస కేంద్రాలు, సైక్లోన్ షెల్టర్లు స్థితిగతులను అంచనా వేసి మరమ్మతులు ఉంటే చేపట్టాలని అలాగే పునరావాస కేంద్రాల్లో భోజనం, పాలు, తాగునీరు ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. రెవిన్యూ అధికారులు టెంపరరీ గృహాలు, జనరేటర్లు, వనరబుల్ ఏరియా మ్యాపింగ్ ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు అలాగే జనరేట ర్లు జెసిబిల యాజమాన్యాలు డ్రైవర్ల ఫోన్ నెంబర్లు అందు బాటులో ఉంచుకోవాలన్నారు. ఉపద్రవాలు సంభవించేందుకు ముందుగానే గ్రామాల వారీగా వివరాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సైక్లోన్ ప్రభావం ఎదుర్కోవడంలో గ్రామస్థాయిలో విఆర్వోలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. మత్స్యశాఖ అధికారులు మత్స్య కారులు సముద్రంపై వేటకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలింపుకు అవసరమైన బోట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు .విద్యుత్ శాఖ విద్యుత్ స్తంభాలను వైర్లను సిద్ధం చేసుకుని విద్యుత్ పునరుద్ధరణకు అన్ని రకాలుగా ముందస్తుగా సిద్ధం కావాలన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు త్రాగునీటి వ్యవస్థల సురక్షిత తాగునీటిని శబ్దం చేసుకోవాలని అదేవిధంగా జనరేటర్లు నీటి శుద్ధి క్లోరినేషన్ కొరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు రహదారులు భవనాలశాఖ అధికారులు జెసిబి లు పవర్ రంపాలు రహదారుల పునరుద్ధరణ నిమిత్తం సిద్ధం చేసుకోవాలన్నారు. జల వనరుల శాఖ అధికారులు గండ్లు పూడ్చేందుక ఇసుక బస్తాల ను యంత్ర సమగ్రంగా సిద్ధం చేసుకోవాలన్నారు. వైర్లెస్ చెట్లు సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా చేయాల్సిన పనులపై ప్రత్యేక ఉంటుందని పోలీసు వైర్లెస్ సెట్లు సైక్లోన్ ప్రభావం ఉన్నప్పుడు అత్యవసరంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు సైక్లోన్ సెంటర్లు, పునరావాస కేంద్రాలు పూర్తిగా ఫంక్షనింగ్ లోనికి తీసుకురావాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు పౌరులకు అవసరమైన నిత్యా వసరాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సర్కార్ చేసేందుకు సిద్ధం కావాలన్నారు. మానవ, పశు నష్టాలు సంభవించకుండా పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు రచించి గత అనుభవాలను జోడిస్తూ సమర్థవంతంగా తుఫానులను ఎదుర్కొనవాలని ఆయన సూచించారు ఆయన మండలాల వారీగా సైక్లోన్ మిడిగేషన్ కార్యాచరణ ప్రణాళికలు గూర్చి ఆరా తీసి ఎప్పటికప్పుడు ఆయా కార్యాచరణ ప్రణాళికలను అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. కార్యచరణ ప్రణాళికల ద్వారా అవుట్ కం పూర్తిగా రాబట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు ఆర్డీవోలు వసంతరాయుడు ముక్కంటి , సింధు సుబ్రహ్మణ్యం ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ ఎస్సీ చంటిబాబు సిపిఓ వెంకటేశ్వర్లు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు డిపిఓ వి కృష్ణకుమారి సాంఘిక సంక్షేమ శాఖ జేడి జ్యోతిలక్ష్మి, సహాయ కార్మిక కమిషనర్ నాగలక్ష్మి, జెడిఎ వై ఆనంద్ కుమారి, పశుసంవర్ధక శాఖ జీడి డాక్టర్ ఏ జైపాల్ డ్వామా పిడి ఎస్ మధుసూదన్ మత్స్యశాఖ జేడీ ఫేక్ లాల్ మహమ్మద్, మార్కెటింగ్ శాఖ ఏడి కె విశాలాక్షి, డిసిహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డిఎస్ సునీత గృహ నిర్మాణ సంస్థ పలక సంచాలకులు శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖ అధికారి డిఆర్డిఏ పిడి శివశంకర్ ప్రసాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి మల్లికార్జునరావు జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!