Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 8:00 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 8:00 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 8:00 PM
Follow Us

హడలెత్తిస్తున్న గ్రామ సింహాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

హడలెత్తిస్తున్న గ్రామసింహాలు…. బెంబేలెత్తిపోతున్న ప్రజలు..

– బెడద ఎక్కువౌతున్నా పట్టించుకోని అధికారులు

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:

రాయవరం లో పలు వీధుల్లో వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రాయవరం ఎక్కడ చూసిన కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. మెయిన్ రోడ్డు వద్ద దళిత పేట, పొలమ్మ పుట్ట వంతెన వద్ద రాజేశ్వరీ కాలనీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా గ్రామ సింహాలు తీవ్ర ఇబ్బంది పెడుతూ ప్రజలను భయాందోళన చేస్తున్నాయి

పాఠశాలలకు వెళ్ళే చిన్నారుల మీద, రహదారుల వెంట నడిచే ఇతర పాదచారుల మీద దాడి చేసి వారిని భీతావహులను చేస్తున్నాయి. వీటి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రిళ్ళు ద్విచక్ర వాహనదారుల వెంటపడి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఇటీవల మెయిన్ రోడ్డు వద్ద ఒక కుక్క వలన అనేక మంది కుక్క గాటుకు గురయ్యారు వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటిని తొలగించాలని అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు రాత్రి సమయాల్లో వీటి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతున్నాయని అత్యవసర పనులపై బయటకు రావాలంటే భయాందోళనకు గురి కావలసి వస్తుందని , కుక్కల కాటుకు గురయ్యాక, స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఇంజెక్షన్లు లభ్యమవకపోవదం వలన ప్రైవేట్త్ ఆసుపత్రులలో రెండు వేల రూపాయలు ఖర్చు చేయవలిసివస్తొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజల ఇబ్బందులను అధికారులు దృష్ఠిలో ఉంచుకుని పలు వీధిలొ కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement