Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 5:38 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 5:38 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 5:38 PM
Follow Us

గెయిల్ వారి సౌజన్యంతో దివ్యాంగులకు ఉపకరణ పరికరాలు పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*గెయిల్ వారి సౌజన్యంతో దివ్యాంగులకు ఉపకరణ పరికరాలు పంపిణీ*

 

*నూతన జిల్లా ప్రజలకు గెయిల్ సహాయ సహకారాలు అందించాలని కోరిన*

 

*ఎంపీ చింతా అనురాధ కలెక్టర్ హిమాన్సు శుక్లా*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం సెప్టెంబర్ 17 నవభూమి న్యూస్ –

 

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు క్షత్రియ కళ్యాణ మండపంలో శనివారం నాడు గెయిల్ ఇండియా సంస్థ సౌజన్యంతో ఎంపీ చింతా అనురాధ ఆధ్వర్యంలో గెయిల్ ఇండియా లిమిటెడ్ సామాజిక సేవా దృక్పథంతో 49 లక్షల రూపాయలతో దివ్యాంగులకు ఉపకరణ పరికరాలు పంపిణీకి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ చింతా అనురాధ, జిల్లా కలెక్టర్ హిమాన్సాశుక్లా పాల్గొన్నాని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ట్రై బ్యాటరీ సైకిళ్ళు వినికిడి యంత్రాలు మరియు కృత్రిమ అవయవాలు అమలాపురం పార్లమెంటు సభ్యులు చింతా అనురాధ, మరియు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, గెయిల్ ఇండియా లిమిటెడ్ సి జి ఎం కె వి ఎస్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ సి ఎస్ ఆర్ నిధులు ద్వారా సామాజిక సేవా చేయాలనే దృక్పథంతో 49 లక్షల రూపాయల నిధులతో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు,బ్యాటరీ వాహనాలు వినికిడి యంత్రాలు మరియు అవయవాలు పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా వచ్చే రెండు సంవత్సరాలలో గెయిల్ ఇండియా లిమిటెడ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చమురు సంస్థలు అడుగులు వేయాలని, ఉమ్మడి జిల్లాలో అందరికీ సమానంగా సహాయ సహకారాలు అందించే వారిని అదేవిధంగా జిల్లా విభజన జరిగిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతనంగా ఏర్పడినందున గెయిల్ సంస్థ

నిధులు జిల్లా కు మాత్రమే ఖర్చు చేయాలని త్వరలో అన్ని చమురు సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధి చేయడం జరిగుతుదని ఎంపీ అనురాధ అన్నారు,కలెక్టర్ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ చమురు సంస్థల తీరుపై కొంత మేర అసంతృప్తి వ్యక్తం చేశారు నిధులు మంజూరు చేయడం లో కొంత ఆలస్యం చేయడం కోట్లల్లో ప్రజలకు సహాయ సహకారాలు చేయవలసిన గేల్ సంస్థ లక్షలతో సరిపెడుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగుల సంక్షేమం సంఘం నాయకులు సరైన దివ్యాంగులకు అందజేయక నకిలీ సర్టిఫికెట్ లతో ఇతరులకు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా మేము పార్టీ కోసం కృషి చేస్తామని మాకు సరైన న్యాయం చేయాలని ఎంపీ అనురాధ కలెక్టర్ హిమాన్సు శుక్లా వద్ధ ఆవేదన వ్యక్తం చేశారు, మీకు తప్పనిసరిగా సరైన న్యాయం జరిగే విధంగా చేస్తామని కలెక్టర్ హిమాన్సు శుక్లా ఎంపీ చింతా అనురాధ హామీ ఇచ్చారు , సి జి ఎం కె వి ఎస్ రావు మాట్లాడుతూ గెయిల్ ఇండియా లిమిటెడ్ ద్వారా కోనసీమ జిల్లా లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఇంతవరకు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ లైట్ లు ఏర్పాటు చేయడం జరిగింది అని, అదేవిధంగా మినిస్టర్ విశ్వరూప్ ఎంపీ కోరికపై ఇప్పుడు 49 లక్షల రూపాయల నిధులతో దివ్యాంగులకు ట్రై బ్యాటరీ సైకిళ్ళు వినికిడి యంత్రాలు మరియు అవయవాలు పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా ఇక ముందు జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గెయిల్ ఇండియా సంస్థ సిద్ధంగా ఉందని అన్నారు,

 

ఈ కార్యక్రమంలో జెట్పిటీసి లు కొనుకు గౌతమి, పందిరి శ్రీహరి గోపాల్,హితకారిని కార్పొరేషన్ చైర్మన్ కాశి మని కుమారి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు ,కౌన్సిలర్ సంసాని బుల్లి నాని, ఆర్డీఓ వసంత రాయుడు, మున్సిపల్ కమిషనర్ ఒమ్మి అప్పలనాయుడు,మరియు గెయిల్ ఇండియా లిమిటెడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement