Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

హిందీ భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

హిందీ భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

అమలాపురంలో ఘనంగా హిందీ దివస్

అమలాపురం;

హిందీ భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఫౌండర్ ఈ గురుకులం ఐఏఎస్ ఆకెళ్ళ రాఘవేంద్రరావు కోరారు .ఆదివారం హిందీ భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా తులసి హిందీ సేవా సమితి ఆధ్వర్యంలో అమలాపురం బాలికల హైస్కూల్ ఆవరణలో జరిగిన హిందీ దివస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు హిందీ భాషా సౌరభాన్ని ఆయన ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు వివరించారు స్వాతంత్ర సంగ్రామంలో అందర్నీ ఏకం చేయడంలో హిందీ భాష ప్రముఖ పాత్ర పోషించింది అన్నారు. అలాగే దేశంలో అత్యధిక భాషల్లో హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ అన్నారు . రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశంలో గుర్తించబడ్డ 22 భాషల్లో హిందీ అధికారిక భాషగా గుర్తించడం అభినందనీయం అన్నారు. హిందీ భాష గురువుగా రెడ్డి వెంకటేశ్వర వద్ద తాను ఎన్నో వ్యాకరణ సూత్రాలను నేర్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్నానని ఆయన అందరి ముందు సగర్వంగా తెలిపారు అనంతరం మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన . రామచంద్రపురం గవర్నమెంట్ డిగ్రీకాలేజ్ హిందీ లెక్చరర్ నక్కా వెంకటరమణ మాట్లాడుతూహిందీ భాషా ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ చాటి చెప్పాలన్నారు అనంతరం హిందీ భాష ద్వారా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న , హిందీ భాషా కీర్తిని దశదిశలకు వ్యాపింప చేస్తున్న అధ్యాపకులకు అభినందనలు తెలిపారు తొలుత ఈ కార్యక్రమానికి రామచంద్రపురం హిందీ జూనియర్ లెక్చరర్ కె వి వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు .ఈ సందర్భంగా సయ్యద్ ఆగాహుస్సేన్, ఎండి హబీబున్నిసా, జే.సుగుణ , ర్యాలీ సుబ్బలక్ష్మి,దొమ్మేటి పద్మావతి , ముత్యాల వెంకటేశ్వరరావు లను ఘనంగా మెమెంటోలు దుస్సాలువ పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ ఆర్కే సత్యానందం, ఎల్ వి వి సత్యనారాయణ, కె ఎం జి వి ఎన్ సత్యనారాయణ, కే శ్రీనివాస్, వీధి దుర్గారావు బి మహాలక్ష్మి , పూర్ణిమ,జయశ్రీ

పి ఏడుకొండలు తో పాటు విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!