విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
కడియం నర్సరీలకు విచ్చేసిన కాకినాడ, ..కోనసీమ కలక్టర్లు
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక విజయ దుర్గా నర్సరీని కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలక్టర్లు క్రితిక శుక్లా,హిమాన్సు శుక్లాలు ఆదివారం సందర్శించారు.ఇక్కడ మొక్కల అందాలకు తిలకించారు. వాటి ప్రత్యేకతలను రైతులను అడిగి తెలుసుకున్నారు.ఆ నర్సరీ రైతులు రావిపాటి వెంకటేశ్వరరావు, రామకృష్ణ లు ఈ కలెక్టర్ల దంపతులకు మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. కడియపులంక మాజీ సర్పంచ్ పుల్లా రామారావు కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.