Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన రేవా కార్ల్డె డేవిడ్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణ:

*విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన రె వ. కార్ల్ డేవిడ్*

 

అమలాపురం-విశ్వం వాయిస్ న్యూస్:

 

విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి విచ్చేసిన రెవ. కార్ల్ డేవిడ్ కొమానపల్లి కి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ నాయకులు..

 

అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు కార్ల్ డేవిడ్ కొమానపల్లి ఇటీవల తన 26 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని గత రాత్రి అమలాపురం తన స్వగృహానికి చేరుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా గత నెల 25న అమెరికా వెళ్లిన ఆయన క్రైస్తవ మిషనరీల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు క్రైస్తవ నాయకులతో సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు.

 

ఆయన పర్యటన ముగించుకొని స్వదేశానికి క్షేమంగా రావడంతో జిల్లా యునైటెడ్ పాస్టర్ నాయకులు అయనకి పుష్ప గుచ్చం ఇచ్చి దుస్సాలువాలతో సత్కరించారు.

 

జిల్లా నాయకులు యెహోషువ, భాస్కర్ రావు, స్పర్జన్ రాజు మాట్లాడుతూ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ను దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్న అధ్యక్షులు కార్ల్ డేవిడ్ కొమానపల్లి కి మా సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామని తెలిపారు. విదేశీ ప్రయాణం ముగించుకుని క్షేమంగా స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా యుపిఎఫ్ ట్రెజరర్ అంబటి సామ్యూల్, జాయింట్ సెక్రెటరీ అబ్రహం పిన్ని, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పరంజ్యోతి బాబు, ఎజ్రా, పి.ప్రసాద్, అమలాపురం జోన్ చైర్మన్ గొలగోటి సత్యప్రసాద్, జోన్ ట్రెజరర్ ఆనంద్ రావు, జోన్ అడ్వైజర్ జ్యోతిబాబు, డి.సాల్మన్ రాజు, జోన్ మీడియా ప్రతినిధి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!