విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణ:
*తెలుగు యువత నిరుద్యోగ ర్యాలీ*
, *తక్షణమే ఉధ్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని*
*రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు*
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం సెప్టెంబర్ 21
తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగు యువత నిరుద్యోగ సమస్య పై చేస్తున్న పాదయాత్ర కు అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత జిల్లాలోని ఆయా మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలతో బైకులపై ర్యాలీగా నలువైపుల నుంచి అమలాపురం గడియార స్తంభం వద్దకు చేరుకుని పాదయాత్ర లో భాగంగా బుధవారం నాడు అమలాపురం గడియారం స్తంభం సెంటర్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి తెలుగు యువత కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు అలంకరించి అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది,ఈ ర్యాలీలో నల్లవంతెన వద్ద గలదివంగత మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణ, ఎన్టీఆర్ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చూస్తుందని వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు, ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అయిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా పబ్బం గడుపుకుంటున్నారు అని అదేవిధంగా ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అని అన్నారు, అదేవిధంగా నిన్న అసెంబ్లీలో మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అని అబద్ధాలతో యువతను మోసం చేస్తున్నావు అని ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని ఆడుతున్న తెలుగుదేశం పార్టీ యువత పై అక్రమ కేసులతో కాలం గడుపుతున్నారు అని, తక్షణమే ఉద్యోగాలు ప్రకటన చేయక పోతే మిమ్మల్ని గద్దె దించుతామని అన్నారు, అనంతరం కలెక్టర్ హిమాన్సు శుక్లా కు నిరుద్యోగ సమస్యను వివరించారు,ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం మాజీ శాసనసభ్యులు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి అయితాబత్తుల ఆనందరావు, మున్సిపల్ కౌన్సిలర్ ఆసెట్టి ఆది బాబు, కొత్తపేట మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యసభ్యులు నాయకులు మెట్ల రమణబాబు, టిడిపి సీనియర్ నాయకులు పెచ్ఛెట్టి చంద్రమౌళి, టిడిపి మహిళా అధ్యక్షురాలు పెచ్ఛెట్టి విజయలక్ష్మి , రెడ్డి అనంతలక్ష్మి, రాష్ట్ర టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి బత్తుల ప్రసాద్, అమలాపురం టిడిపి సీనియర్ నాయకులు పోతుల సుభాష్ చంద్రబోస్, టిడిపి సీనియర్ నాయకులు పరమట శ్యామ్, దేవరపల్లి వీరేష్ కుమార్ మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ యువత పాల్గొన్నారు.