Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,032,671
Total recovered
Updated on October 3, 2022 4:21 PM

ACTIVE

India
36,126
Total active cases
Updated on October 3, 2022 4:21 PM

DEATHS

India
528,701
Total deaths
Updated on October 3, 2022 4:21 PM

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్ కు ఏం సంబంధం..? అని ప్రశ్నించారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్…

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్ కు ఏం సంబంధం..? అని ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. 1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని, తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని, ఆయన మరణానంతరం 1998లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలన్న ఆలోచన జగన్ తండ్రి వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ చెయ్యలేదని పేర్కొన్నారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితమన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని విమర్శించారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి…వర్సిటీ పరువు తీసిన జగన్ ప్రభుత్వం ఏ హక్కుతో పేరు మార్చుతుందని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా వారి పేర్లు పెట్టుకుంటే పేరు రాదని, వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుందని సూచించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని ఎమ్మెల్యే భవాని హితవు పలికారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!