Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 6:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 6:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 6:16 AM

ఆర్థిక శ్రేయస్సు ద్వారానే ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధ్యం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పారిశ్రామిక, రవాణా, వ్యవసాయం, టూరిజం రంగాల అభివృద్ధి.. తద్వారా ఉపాధి కల్పన సాధ్యమవుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

పారిశ్రామిక, రవాణా, వ్యవసాయం, టూరిజం రంగాల అభివృద్ధి.. తద్వారా ఉపాధి కల్పన సాధ్యమవుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. గురువారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదాన ప్రాంగణంలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టనున్న ఎనిమిది జాతీయ రహదారుల పనులకు వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పనులకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితర ప్రజాప్రతినిధులు తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రహదారి నిర్మాణాలు స్థానిక జనాభా రహదారి వినియోగదారులపై కనీస ప్రతికూల ప్రభావంతో ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయన్నారు.

పర్యావరణంపై కనిష్ట ప్రతికూల ప్రభావం “ఎన్ హెచ్ 516 ఈ” రంపచోడవరం నుండి కొయ్యూరు సెక్షన్ వరకు సుగమం చేసే దిశలో రెండు లైన్ల రహదారి పనులు చేపట్టడం జరుగుతోందన్నారు.ఎకో టూరిజంను పరిరక్షణ కోసం భూమిని కనిష్టంగా సేకరించడం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పెంపొందిస్తోందని చెప్పారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా ద్వారా సురక్షితమైన, మెరుగైన మరియు వేగవంతమైన ఇంట్రా-స్టేట్ కనెక్టివిటీ లో భాగంగా లంబసింగి – అరకు పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ అందుబాటులోకి రానుందన్నారు. ప్రయాణీకుల భద్రత, ఐదు బ్లాక్ స్పాట్‌లను తొలగించే లక్ష్యంతో రూ. 215 కోట్లతో మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం, తేతలి, కైకరం, నామవరం – శాటిలైట్ సిటీ వంటి ముఖ్యమైన గమ్యస్థానాలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను అందించడానికి రూ. 215 కోట్లతో నాలుగులైన్ల ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మండపేట, రామచంద్రపురం, కాకినాడ, ఉండ్రాజవరం, నిడదవోలు, తణుకు పట్టణం, వాకలపూడి పోర్ట్ కనెక్టివిటీ కింద ఎన్ హెచ్ 516 ఎఫ్ పై సామర్లకోట నుండి అచ్చంపేట జంక్షన్ వరకు, వాకలపూడి నుండి ఉప్పాడ బీచ్ రోడ్డు మీదుగా అన్నవరం వరకు నాలుగు లైన్లతో కూడి రెండు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు రూపొందించబడ్డా యని తెలిపారు.ఇది పూర్తయిన తర్వాత హైదరాబాద్ – విశాఖపట్నం నుండి కాకినాడ సెజ్, సెజ్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్‌లకు మెరుగైన కనెక్టివిటీని సౌకర్యం అందుబాటులోకి రానుందని వివరించారు. అలాగే సామర్లకోట, అన్నవరం, బిక్కవోలు, ర్యాలీ, పిఠాపురం వంటి మతపరమైన ప్రదేశాలకు కనెక్టివిటీని అందిస్తుందన్నారు.
కాకినాడ జిల్లా ద్వారా అంతర్ రాష్ట్ర కనెక్టివిటీ, ఇంధన వ్యయ తగ్గింపు,మెరుగైన ఓడరేవు కనెక్టివిటీ అందించడం, బియ్యం, సముద్రపు ఆహారం, ఇతర ఆహార ఉత్పత్తులు, ఇనుప ఖనిజం, బయో ఇంధనం, గ్రానైట్ మొదలైన వాటి రవాణాకు ఊతమివ్వడం వల్ల పారిశ్రామిక, రవాణా, వ్యవసాయం టూరిజం రంగాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు.వీటి ద్వారా ఈ ప్రాంతాల్లో క్రమంగా ఉపాధి కల్పన సాధ్యం… ఇటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ఆర్థిక శ్రేయస్సును తీసుకు రావడానికి , ఇక్కడి ప్రజల ఆర్థిక వ్యవస్థను మార్పుకి ఉపకరిస్తాయన్నారు. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా “ఆత్మనిర్భర్ భారత్” సాధ్యం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి నగర ప్రాశస్త్యాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కి వివరించారు. చారిత్రక నగరం రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందని, రహదారులు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తే చాలా వరకూ ఈ నగర వాసులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాలలో జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్ట్స్ మరిన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఎంపీ భరత్ కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సభలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వర రావు (రాజా), ఆర్అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు, నేషనల్ హైవే పీడీ సురేంద్రబాబు, కాకినాడ, అమలాపురం, అరకు ఎంపీలు వంగా గీత, చింతా అనూరాధ, జీ మాధవి, జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి, రాజమండ్రి రూరల్, అనపర్తి, కొత్తపేట, గోపాలపురం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకటరావు, రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా కలెక్టర్ కే మాధవీలత, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, జాతీయ రహదారి అధికారులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి గడ్కరీకి ఘన సత్కారం..

జాతీయ రహదారి ప్రాజెక్ట్స్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. పూలమాలలు, శాలువాలతో పాటు పలు జ్ఞాపికలతో సత్కరించారు. వెండి బిందెను, బుద్ధుని విగ్రహాన్ని, ఇలా అనేక రకాల కానుకలతో కేంద్ర మంత్రిని ముంచెత్తారు. గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు ఆత్మీయ సత్కారానికి కేంద్ర మంత్రి ఉబ్బితబ్బిబ్బయ్యారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!