Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 2:37 PM

ACTIVE

India
44,500,353
Total active cases
Updated on March 28, 2024 2:37 PM

DEATHS

India
533,540
Total deaths
Updated on March 28, 2024 2:37 PM
Follow Us

అక్కా చెల్లెమ్మల భవితకు వైయస్ చేయూత పథకం మూడో విడత నగదు జమ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

అమలాపురం సెప్టెంబర్ 23: అక్కా చెల్లెమ్మల భవితకు, జీవనోపాదుల కల్పనకు, ఆర్థిక సాధికారత, ఆర్థిక ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ చేయూ త కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి సుస్థిర జీవనోపాదులు కల్పన దిశగా పాటుపడుతోందని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం నుండి మూడో విడత చేయూత నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి డిబిటి ద్వారా బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని నిరుపేదలకు నవరత్నాలుద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోం దన్నారు.మహిళల సమగ్ర అభి వృద్ధి, ఆర్ధికసాధికారతలో భాగంగా, ప్రభుత్వం నవరత్నాలులో భాగంగా వై.యస్.ఆర్ చేయూత పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. చేయూత కార్యక్రమం 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల బి.సి, యస్.సి. యస్.టి మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు నాలుగు దఫాలలో రూ.75000/- ఆర్థిక సహాయం అందించడానికి ఒక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమమన్నారు . చేయూత ద్వారా మహిళా లబ్దిదారులకు కుటుంబస్థాయిలో మెరుగైన జీవనోపాధులను అందిపుచ్చుకునే విధంగా అవకాశాలను కల్పించడం, సంపద సృష్టి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్య మన్నారు. చేయూత పథకం క్రింద ప్రభుత్వం రిటైల్ మరియు వస్త్ర వ్యాపారంలో గుర్తించబడిన లబ్దిదా రులకు మద్ద తు ఇవ్వడానికి అమూ ల్, హిందుస్థాన్ యూనిల్వీర్ ITC లిమిటెడ్, లిమిటెడ్, ప్రాక్టర్ & గాంబుల్, రిలయన్స్ రిటైల్, అజియో బిజినెస్ వంటి బహు ళజాతి కంపెనీలతో భాగస్వా మ్యాన్ని ఒప్పందాలు కుదుర్చు కుందన్నారు . పాడిరైతులకు పశువుల పెంపకం, పాలసేకరణ మరియు ఆరోగ్య సేవలు, కిరాణా షాపులు, బట్టల షాపులు ఏర్పాటు మరియు పండ్లు, కూరగాయలు, చిన్న జీవాలు కొనుగోలు కొరకు ఒప్పందాలు మరియు ఆర్ధిక సహా యం చేయడం ద్వారా చిన్న, మద్య, తరహ వ్యాపా రాలు నడుపుకోవ డానికి లేదా జీవనోపాధి కార్యక్రమా లకు వినియో గించుకోనేందుకు అవకాశం కల్పించటం జరిగింద న్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నియోజక వర్గాల వారీగా చేయూత పథకానికి 3వ విడతలో అమలాపురం నియోజకవర్గoలో 13,489 మంది లబ్ధిదారులకు గాను రూ. 2,529.19లక్షలు, కొత్తపేట నియోజకవర్గoలో 13,568 మంది లబ్ధిదారులకు రూ 2,544.00 లక్షలు, మండపేట నియోజకవర్గం లో 13,615 మంది లబ్ధిదారులకు రూ. 2,552.8లక్షలు,.ముమ్మిడివరం నియోజకవర్గoలో పథకం ద్వారా 12,253 మంది లబ్ధిదారులకు రూ.2, 297.44లక్షలు.,పి గన్నవరం నియోజకవర్గoలో పథకం ద్వారా 15,870 మంది లబ్ధిదారులకు రూ. 2,975.63 లక్షలు,రామచంద్రపురం నియోజకవర్గoలో 9,170 మంది లబ్ధిదారులకు రూ. 1,719.38 లక్షలు,. రాజోలు నియోజకవర్గoలో 11,209 మంది లబ్ధిదారులకు రూ. 2,101.69 లక్షలు జమకాబడింద న్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బీసీ కార్పొ రేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఏపీ మైనారిటీస్ కార్పొరేషన్, క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వారీగా జిల్లాలో మొత్తం వైయస్సార్ చేయూత పథకానికి 89,174 మంది లబ్ధిదారులకు గాను రూ. 16,720.13 లక్షలు లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా జమకాబడ్డా యన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి మెప్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7,154 మంది లబ్ధిదారులకు గాను రూ 13.41,37,500 లక్షలు జమ అయిందన్నారు చేయూత మహిళా లబ్ధిదారులకు అదనపు ఆదాయా న్ని అందించడానికి ప్రభుత్వం అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ITC లిమిటెడ్, ప్రాక్టర్ & గాంబుల్, రిలయన్స్ రిటైల్ వంటి బహుళజాతి కంపెనీలతో భాగస్వా మ్యం కుదుర్చుకుందన్నారు . దీని ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు రిటైల్ రంగాలలో మహి ళలు జీవనోపాధులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వారి కుటుంబ ఆదాయాలను పెంచుతున్నామ న్నారు. చేయూత ద్వారా సుస్థిర జీవనోపాధులను ప్రోత్సహించ డానికి, MEPMA, SERP బహుళ జాతి కంపెనీలైన రిలయన్స్ అజియో బిజినెస్ తధితర కంపె నీలతో ఒప్పందం ప్రభుత్వం కుదుర్చుకుందన్నారు. స్థానిక మండల పరిధిలోని ఇందుపల్లికి చెందిన సుజాత చేయూత కార్య క్రమం ద్వారా తనస్పందనను తెలియజేస్తూ రెండు విడతలుగా వచ్చిన చేయూత నిధులతో కుట్టుమిషన్ స్వీయింగ్ మిషన్ కొనుగోలు చేసుకున్నానని ఈ మూడో విడత నిధులతో రెడీమేడ్ దుస్తులు వ్యాపారం ద్వారా సుస్థిర జీవనోపాదులు పెంపొందించుకోవ డానికి కృషి చేస్తానన్నారు. ఏ. వేమ వరపుపాడుకు చెందిన పి శాంత కుమారి అనే లబ్ధిదార మహిళ తన స్పందనను తెలియజేస్తూ రెండు విడతలుగా వచ్చిన నిధులతో టైలరింగ్ మిషన్, ఓవర్ లాక్ మిషన్, డిజైన్ వర్క్ మిషన్, జిగ్ జాగ్ మిషన్ కొనుగోలు చేశానని మూడో విడత నిధులతో వ్యాపా రాన్ని బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. స్థానిక 30 వ వార్డుకు చెందిన లీలా కుమారి మెప్మా ద్వారా రెండు విడతలుగా చేకూరిన నిధులతో తోపుడు బండిపై బజ్జీలు వ్యాపారం మొదలు పెట్టానని మూడవ విడత నిధుల ద్వారా సుస్థిర జీవనోపా దులు పూర్తిస్థాయిలో పొందగల మని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహిళల పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వివక్షతకు లంచాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా అందిస్తూ మహిళల ఆర్థిక స్వావలoబన, మహిళాసాధికారత దిశగా ఎంతో మేలు చేకూర్చడం జరుగుతోo దన్నారు. తాము ఎప్పటికీ ముఖ్యమంత్రివర్యులుకు రుణపడి ఉంటామని ఆమె స్పందనను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు కె. చిట్టిబాబు, రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్మన్ కె సత్య శైలజ, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వి.శివశంకర్ ప్రసాద్, బీసీ కార్పొరేషన్ అధికారి సుబ్బ లక్ష్మి,ఏపీడి ఎంఎం జలాని, డిపిఎం విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement