Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 1:13 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 1:13 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 1:13 AM
Follow Us

*రుణ యాప్ ల నిర్వాహకులు అరెస్ట్*

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:

లోన్ యాప్ ల నిర్వాహకులు అరెస్ట్

 

– ఏజెంట్లు గా ఎవరైన సహకరించినా వారి పై చట్టరీత్య కఠిన చర్యలు తప్పవు

 

రాజమహేంద్రవరం,విశ్వం8 వాయిస్ న్యూస్ క్రైమ్:

 

రాజమహేంద్రవరం స్థానిక దిశా పోలీస్ స్టేషన్లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ నిర్వహించిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7 వ తేదీన పురుగుల మందు త్రాగి కొల్లి దుర్గా రావు, కొల్లి రమ్య లక్ష్మి, భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ నందు కేసు నెం. నెంబర్ 187/2022 u/s 306, 406, 420, 384, 509 r/w 34 IPC Section 67 A, 66-C of IT Act గా నమోదు చేయడమైనది. సదరు చనిపోయిన భార్యా భర్తలు తమ అవసరాలకై తీసుకున్న చిన్న మొత్తాల లోను ను తిరిగి ఎక్కువ మొత్తంలో తీర్చమని లేని ఎడల వారి యొక్క ఫోటోలును మార్చింగ్ చేసి (అసభ్యకరమైన ఫోటోలుగా మార్చి) సోషల్ మీడియా నందు, వారి ఫోన్ నందుగల అన్ని కాంటాక్ట్ నంబర్స్ కు పెడతామని బెదిరింపులు వచ్చినట్లు తెలియ వచ్చింది.మృతులను బెదిరింపులకు గురిచేసిన హాండీ లోన్ మరియు స్పీడ్ లోన్ అను రెండు లోన్ యాప్ లతో పనిచేస్తున్న ఏడుగురుని ఇదివరకే అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి. రాజమండ్రి పోలీసులు కుణ్ణంగా దర్యాప్తు చేసి క్రమబద్ధంగా విశ్లేషించి లోన్ ముద్దాయిలు అందరిని గుర్తించడం జరిగింది.

దర్యాప్తులో భాగంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలలో దర్యాప్తు చేసి మరో నలుగురు ముద్దాయి లను అరెస్ట్ చేయడం జరిగినది. లోన్ యాప్ నిర్వాహకులు చాకచక్యంగా మూడు దశలలో మల్టీ లెవెల్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ఎకౌంటులను సృష్టించి నిరుద్యోగులకు డబ్బు ఎరగా వేసి వారి బ్యాంక్ ఎకౌంటు ద్వారా లోన్ యాప్ బాధితులకు చిన్న మొత్తములో లోను ఇచ్చి రెండు-మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు.

మొదటి దశలో సుమారు 80 నుండి 100 సేవింగ్ ఖాతాలు సృష్టించి, ఒక్కో అకౌంట్ నుండి ప్రతి నెల సుమారు 100 మందికి అప్పు ఇచ్చి దానికి రెండు మూడు వంతులు అధికంగా వసూలు చేస్తారు. ఈ విధంగా వివిధ బాధితుల నుండి వసూలు అయిన డబ్బులు 2వ దశలో సుమారు 20 కంపెనీల పేర్లతో ఓపెన్ చేయబడిన కరెంటు అకౌంట్లకు జమ అవుతున్నది. ఈ కరెంటు అకౌంట్ లావాదేవీలు పరిశీలించగా సదరు ఒక్కొక్క అకౌంట్లో ఒక నెలకు సుమారు 15-20 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసినది. ఈ విధంగా లోన్ యాప్ నుండి అప్పు తీసుకున్న వారిని బెదిరించి వసూలు చేసిన సొమ్మును అంతటిని కూడా 3వ దశలో గుజరాత్ లో స్థాపించబడిన షెల్ కంపెనీల ఎకౌంటు లకు నగదు బదిలీ చేసి సదరు ఎకౌంటు నుంచి విత్ డ్రా చేసి హవాల మార్గం ద్వారా ఆ నగదును లోన్ యాప్ ఓనర్స్ తీసుకున్నట్లు తెలిసినది.

 

గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన షెల్ కంపెనీ ఓనర్లుగా ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరు పరచడమైనది. అరెస్ట్ చేసిన సమయంలో ఈ కేసు లో ప్రధాన నిందితుడు తృటిలో తప్పించికోవడం జరిగినది. అతని అరెస్ట్ కొరకు ప్రత్యేక బృందాలను పంపడం జరిగింది.

 

 

ఈ నిందితులను పట్టుకోనుటకు కె. లక్షమణ రెడ్డి, సి.ఐ నల్లజర్ల మరియు వారి బృందం గుజరాత్ రాష్ట్రనికి ఎ.శ్రీనివాస రావు, సి.ఐ దేవరపల్లి మరియు వారి బృందం మహారాష్ట్ర రాష్ట్రనికి మరియు పి.ఈ. పవన్ కుమార్ రెడ్డి, సి.ఐ ప్రకాష్ నగర్ మరియు వారి బృందం కర్ణాటక రాష్ట్ర లలో పర్యటించి లోన్ యాప్ నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచినారు. అదేవిధంగా ఈ లోన్ యాప్ నిర్వాహకులకు ఎవరైన సహకరించినట్లుయితే అట్టి వారి అందరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును.

 

ప్రజలు ఇలాంటి యాప్ లను నమ్మి అదే విధంగా వారి ఫోన్ లో వున్న కాంటాక్ట్స్, గాలరీ, -కాల్స్, మెసేజెస్ అండ్ ఫైల్స్ access ఇవ్వకుడదని విజ్ఞప్తి. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడినా, ఈ విధమైన లోన్ App ఏజెంట్లు గా పనిచేసినా, వారు Sec. 384, 386 IPC ప్రకారం 10 సం.లు వరకు జైలు శిక్షార్హులు. వారిపై కఠిన చర్యలు తీసుకోబడును.నింధితులు వివరములు:1) లంబాడి నరేష్, వయసు/23 సం. మానికొండ, గండిపేట, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. 2) మేడిశెట్టి పృద్విరాజ్, వయసు/22 సం.లు, P. తిమ్మాపురం గ్రామము, పిఠాపురం మండలము,3) నక్కా సుమంత్, వయసు/23 సం.లు, ఏలేశ్వరం గ్రామము. కాకినాడ జిల్లా. 4) దానబోయిన భాస్కర్, 23 సం.లు, సిరిసాపల్లి గ్రామము,మండలము, ఎన్ అర్ పేట రోడ్, అనకాపల్లి 5) మండా వీర వెంకట హరి బాబు, 23 సం.లు, జె. అన్నవరం గ్రామము, ఏలేశ్వరం మండలము,కాకినాడ జిల్లా,6) కోరుపోలు రామకృష్ణ, 24 సం.లు., కె.కె అగ్రహారం, కె. సంతపాలెం, కె. కోటపాడు మండలము విశాఖపట్నం జిల్లా,7) కొల్లూరు శ్రీనివాస్ యాదవ్, A/27 సం.లు, మదీనాగూడ, మియాపూర్, సిరిలింగంపల్లి మండలము, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రము.8) గోవింద్ రాజేంద్ర ప్రసాద్, 36 సం.లు, బండారి గూడెం, మునుగురు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణా రాష్ట్రము, ప్రస్తుతం వారణాసిగూడా, సికింద్రాబాద్.9) పటేల్ నితిన్ కుమార్ రమేష్ భాయి, 19 సం.లు, లిల్పూర్, నవగం పోస్ట్, సబర్కత జిల్లా, గుజరాత్ 10) పటేల్ మిలన్ కుమార్ రాజేష్ భాయి, 26 సం.లు, ముఖిన్ పత్, చరాడ, గాంధీ నగర్,

గుజరాత్ రాష్ట్రము.11) రాభారి విధాన్, 26 సం.లు, ముఖిన్ పత్, కలోల్, గాంధీ నగర్, గుజరాత్ రాష్ట్రము లోన్ యాప్ ల నిర్వాహకులను అరెస్ట్ చేయడం జరిగింది అని అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement