విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
ఇటీవల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విమల స్కూల్ ఆవరణలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ముయ్ థాయ్ బాక్సింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రావులపాలెం మదర్ థెరీసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ, రావులపాలెం విద్యార్థులకు
శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి స్వగృహం వద్ద వద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ కరాటే ముయ్ థాయ్ బాక్సింగ్ విద్యులు నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఆత్మ రక్షణకు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
కిక్ బాక్సింగ్ విద్యార్థులను అభినందిస్తూ 5000 రూపాయలు నగల బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను తీర్చి దిద్దుతున్న కోచ్ వెంకటలక్ష్మిని అభినందించారు.
32 కేజీల విభాగంలో పట్టా శ్రీ హర్ష గోల్డ్ మెడల్,
33 కేజీల విభాగంలో బి సూర్యకాంత్ గోల్డ్ మెడల్,
28 కేజీలు విభాగంలో బి అశ్విన్ గోల్డ్ మెడల్,
20 కేజీల భాగంలో కే మహిమాకర్ గోల్డ్ మెడల్,
28 కేజీలు భాగంలో ఎల్ సుశాంత్ సిల్వర్ మెడల్,
బాలికలు విభాగంలో 28 కేజీలు భాగంలో పి ఈషశ్రీ గోల్డ్ మెడల్,
32 కేజీలు భాగంలో పి వేణు గోల్ మెడల్,
బాలుర సీనియర్స్ 56 కేజీల భాగంలో టి లక్ష్మీ సందీప్ కిరణ్ గోల్డ్ మెడల్,
52 కేజీలు విభాగంలో పట్టా జస్వంత్ గోల్డ్ మెడల్,
58 కేజీలు భాగంలో యు రిషిత్ గోల్డ్ మెడల్,
49 కేజీలు భాగంలో జి వివేక్ గోల్డ్ మెడల్,
69 కేజీలు భాగంలో ఎం సత్య కాంత్ గోల్డ్ మెడల్ సాధించినట్లు కోచ్ వెంకటలక్ష్మి తెలిపారు…