Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 10:47 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 28, 2024 10:47 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 28, 2024 10:47 PM
Follow Us

జగన్, చంద్రబాబు లకు వేసే ఓటు అభివృద్ధి కి చేటుగా ఆంధ్రులు భావించాలి.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

బూతుల పాలన వద్దు అభివృద్ధి ముద్దు,

నరేంద్ర మోది గుజరాత్ కు అధినేత కాదు. యావత్ భారతదేశం కు ప్రధాని అని గుర్తెరగాలి.
-జాతీయ పార్టీలకు జాతీయ బావాలు కలిగి వుండాలి. గుజరాత్ ప్రయోజనాలు మాత్రమే కాదు.
-మార్పుతో కూడిన ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అవసరం అని భావించాలి.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

2024 లో జరిగే ఎన్నికల్లో జగన్, చంద్రబాబు ల రహితంగా ఓటు హక్కు ను వినియోగించు కోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోది పాలన మొత్తం గుజరాత్ ప్రయోజాలకే అత్యధిక శాతం కేటాయిస్తున్నారని, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నుండి, ప్రభుత్వ సంస్థల నుండి ఇష్టాను సారం పన్నులు వసూలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నిత్యావసరాలపై ధరలు పెరుగుదలకు నియంత్రణ లేకుండా ఆదాయ మార్గాలకు మించి దోచుకుంటున్నారని,

రాష్ట్రాల నుండి జి ఎస్ టి రూపంలో వసూలు చేస్తున్న
వేల కోట్లల్లో రాష్ట్రాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు విడుదల చేయటం లేదని, ఇతర రాష్ట్రాల నుండి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేసిన వాటిలో పెద్దమొత్తంలో నిధులను గుజరాత్ అభివృద్ధికి దారి మళ్లిస్తు ఇతర రాష్ట్రాల అభివృద్ధిని కృంగదీస్తున్నారని, ఇతర రాష్ట్రాల సంపదను సైతం గుజరాతీ కార్పొరేట్లు మోది ఆశీస్సులతో తరలించుకు పోతున్నారని,సహజ వనరులను మోది రాజకీయ అవసరాలకు విదేశీ బహుళ జాతి సంస్థలకు, గుజరాత్ సంపన్నులకు దారి మళ్లిస్తున్నారని, మోది అండ్ కో స్వార్ధప్రయోజనాలకు యావత్ భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. జాతీయ పార్టీలకు జాతీయ సంక్షేమం, భద్రత, పేదరిక నిర్ములన, మెరుగైన పౌర సేవలు, కాలుష్య రహిత సమాజం, సమ సమానత్వం, పక్ష పాతం లేని సమపాలన, నేర రహిత పాలన పై ద్రుష్టి సారించాలని, అందుకు బిన్నంగా కొన్ని రాష్ట్రాలను అణచివేయాలని కక్ష సాధింపు పాలన భారతదేశానికి క్షేమ కరం కాదని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై కక్ష సాధింపు చర్యలు చేపట్టటం ప్రధాని స్థాయిలో సముచితం కాదని,ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల సంపదతో గుజరాత్ లో వేల కోట్లతో అత్యంత సంపన్న నగరాన్ని నిర్ణయించుకుంటున్న మోదికి ప్రధాని గా కొనసాగే అర్హత లేదని,గుజరాత్ కార్పొరేట్ లకు ఆంధ్రప్రదేశ్ ఓడరేవులను, ఎయిర్ పోర్టులను, బహుళ కాంట్రాక్ట్ లను దారా దత్తం చేస్తు ఆంధ్రప్రదేశ్ కు నిధులు విడుదల చేయక పోవటం అన్యాయమైన చర్య అని, ఆంధ్రప్రదేశ్ లో పాలన లేదని, అభివృద్ధి నిర్వీర్యం అని, రోడ్లు లేవని, మెరుగైన విద్యా వైద్యం లేదని, నిత్యం ప్రభుత్వ హామీలు అమలు చేయండి అని రాష్ట్రం నలుమూలల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరసనలు, ధర్నాలు, రాస్తోరాకో లుతో ప్రజలు విలవిల లాడిపోతున్నారని, అపార ఖనిజ సంపద గల ఆంధ్రప్రదేశ్ ను మోది అండ్ కో ఎడారి గా మార్చటమే పనిగా రాష్ట్రం పై కాలకూట విషం చిమ్ముతున్నారని, మోది (బిజెపి) బృందం తో రహస్యంగా చెమ్మ చెక్క ఆట ఆడుతున్న జగన్, చంద్రబాబు పార్టీలకు ఆంధ్రులు తగిన గుణపాఠం చెప్పి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దోహద పడాలని ఆయన కోరారు.జగన్ చంద్రబాబు ల పార్టీలకు బిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ మార్పు అత్యంత అవసరం అని , వీరి ఆధిపత్య పోరుకు రాష్ట్ర భవిష్యత్ సర్వనాశనం అయిపో తుందని,రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన భాద్యత ఆంధ్రులపై వుందని, యావత్ భారతదేశం లోనే ఎంతో మేధస్సు, సహజ వనరులు, వీరోచిత చరిత్ర,అతి గొప్ప పురాతన సనాతన సాంప్రదాయం, అభివృద్ధి కి అనుకూలతలుగా వున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, అలాంటి గొప్ప రాష్ట్రం ను రాజకీయ బానిసత్వానికి కొంతమంది దాసోహం అయ్యి బిడ్డల భవిష్యత్ ను కాలరాస్తున్నారని, చెప్పుకోవటానికి
ఏ గొప్ప చరిత్ర లేని రెండు కుటుంబాల రాజకీయ దాహానికి మెజార్టీ ప్రజల జీవితాలను పతనం చేస్తున్నారని, పౌరులకు ఆలోచించుకునే సమయం లేకుండా నిత్య ఆందోళనలతో జగన్, చంద్రబాబు లు ఆంధ్రప్రదేశ్ లో అశాంతి సృష్టిస్తు నిజాలను సామాది చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సరిహద్దు లేని ఎంత గొప్ప చరిత్ర వున్నా నేటి ప్రధాన నేతలు గా చలామణి అవుతున్న వారితో ప్రగతి శూన్యం అయిపొతుందని, ఆంధ్రప్రదేశ్ ను ఇంత పతనావస్థకు తీసుకెళుతున్న జగన్, చంద్రబాబు లకు ఆంధ్రులు ఓటు వేయవచ్చా ! ఆంధ్రుల చారిత్రిక ప్రతిష్టకు బిన్నంగా వారి జండాలు మోయవచ్చునా ! అనేది ప్రతి ఆంధ్రుడు అంతరాత్మతో ప్రశ్నించుకోవాల్సిన గురుతర భాద్యత మన ముందు వుందని,మన బిడ్డల భవిష్యత్ ముఖ్యమా, జగన్ చంద్రబాబు ల భవిష్యత్ ముఖ్యమో నిర్ణయించుకోవాల్సింది మనమే నని ఆయన తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో పాలన లేకుండా పోయిందని, ప్రభుత్వ శాఖలను రాజకీయ పార్టీల అనుబంధ శాఖలుగా మార్చేసారని, సామాన్యులకు చట్టం, న్యాయం అందని ద్రాక్షగా మారిందని, ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అంతా బూతుల మయం అయి పోయిందని, అధికారులు, పౌరుల మధ్య కూడా బూతు సంభాషణలే నడుస్తున్నాయని, నేటి ప్రభుత్వ పాలనలో తప్పు ఒప్పులకు అర్థాలు మారిపోయాయని,మంచిని, అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి పౌరుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో ప్రజా అవసరాలు, మౌలిక వసతుల సదుపాయాల కోసం ప్రశ్నించే నాయకులు కనపడక పోవటం ఆంధ్రుల దురదృష్టం అని, బూతు నేతలు తో వ్యవస్థ బ్రష్టు పట్టుకుపోతుందని,టివి ల్లో బూతునేతల మాటలు వింటున్న వేదపండితుల నోటినుండి సైతం బూతులు వస్తున్నాయంటే బూతు నేతల ప్రభావం పసి పిల్లల భవిష్యత్ పై కూడా పడుతుందని ఆయన ఆవేదన చెందారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను మెరుగు పరుచుకోవాలంటే, జరిగిన నష్టాన్ని యుద్ధ ప్రాతిపాదికన సాధించుకోవాలంటే జగన్ చంద్రబాబు లకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఏర్పడాల్సిందేనని, జగన్ చంద్రబాబు లకు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి చేటుగా భావించాలని, 2024 ఎన్నికల్లో మోది రహస్య మిత్రపక్షాలకు ఓటు వేసినా, జగన్ చంద్రబాబు లకు ఓటు వేసినా ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేది లేదని, జగన్ గొయ్యి అయితే, చంద్రబాబు నుయ్యి అని ఓటర్లు భావించి రాజకీయ ప్రత్యామ్నాయ ఉద్యమ నేతలను ప్రజలు ప్రోత్సహించాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.
సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, దుడ్డె సురేష్, వల్లి శ్రీనివాసరావు, కోమర్తి గోపి శ్రీనివాసరావు,వర్ధనపు శరత్ కుమార్, దోషి నిషాంత్ , మార్త ప్రభాకర్ , వాడపల్లి జ్యోతిష్, మండవల్లి వెంకటేశ్వరరావు, మండవల్లి శంకర్, మండవల్లి సూరిబాబు, అడపా శేషగిరి, ఇళ్ల రాము, ఇళ్ల దుర్గ, మేకల కిరణ్ కళ్యాణ్త, మాసా అప్పాయమ్మ, నాగూరు అన్నపూర్ణ, సుంకర వెంకట భాస్కర రంగారావు, కొల్లి సత్యనారాయణ, కాకి శ్రీనివాసరావు, మట్టపర్తి తులసీరావు, రెడ్డి స్వర్ణ లత, కోట సుశీల, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బి సోనియా, శీరపు హర్షిత , మాసా సుభద్ర, నూకళ్ల శ్రీదేవి, కోట కుమారి, కోట రాము,
తదితరులు పాల్గొనియున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement