Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 2:52 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 2:52 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 2:52 PM
Follow Us

బిజెపి పార్టీ పోరు యాత్ర ప్రారంభం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

భారతీయ జనతా పార్టీ అమలాపురం, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు ఆదేశానుసారం రాష్ట్రంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరక తలపెట్టిన ప్రజా పోరు యాత్ర స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ లో భాగంగా ఈరోజు ఉదయం అమలాపురం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రజా పోరు యాత్రకు ముఖ్య అతిథులుగా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదావరి అండ్ ఉత్తరాంధ్ర జోన్ కిసాన్ మోర్చా ఇంచార్జ్ బుచ్చిరాజు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కబర్డి జి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బుచ్చిరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలో పీఎం గరీబ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించడం జరిగిందని , ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఒకటి పాయింట్ 1. 22 కోట్ల ఇల్లు మంజూరు చేయడం అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 2.3 కోట్ల ఇల్లు మంజూరు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.22 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని, గత మూడు సంవత్సరాలలో 6.2 కోట్ల ఇళ్లకు కొత్త కుళాయిలతో నీటి కలెక్షన్ అందించడం జరిగిందన్నారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కబర్ది మాట్లాడుతూ ఆరోగ్య రక్షణ మహామారి నివారణ లో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్రింద 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందిన ప్రజలు 3.2 కోట్ల మంది, అలాగే 18 కోట్ల కంటే ఎక్కువ ఆయుష్మాన్ కార్డులు జారీ అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్ కింద 190 కోట్లకు పైగా ఉచిత కరోనా వ్యాక్సిన్ అందించడం జరిగిందని కబార్డి అన్నారు. జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ నవ భారత కోసం నారీ శక్తి అనే పథకం ద్వారా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు 9 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అలాగే 25 కోట్ల మంది మహిళలకు జన్ దన్ ఖాతాల ద్వారా బ్యాంకులతో అనుసంధానం, అలాగే 75 లక్షల SHG’s ద్వారా 8 కోట్ల మంది మహిళ పారిశ్రామికవేత్తల అనుసంధానం, స్టాండప్ ఇండియా పథకం కింద మహిళలకు 80% రుణాలు అందజేత ఇవ్వడం జరిగిందని చిట్టిబాబు తెలియజేశారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో పుంజుకుంటున్న భారత్ దేశవ్యాప్తంగా రోడ్లు విస్తృత వెడల్పు చేయడం, దేశవ్యాప్తంగా రోడ్ల విస్తృత నెట్వర్క్ ఏర్పాటు చేయడం, జాతీయ రహదారుల నిర్మాణ వేగం 208% పెరుగుదల 2013 – 14 లలో 12 కిలోమీటర్లు రోజు వేగం నుండి ప్రస్తుతం 37 కి.మీ రోజుకు పెంపు, అలాగే ఉడాన్ పథకం కింద 87 లక్షల మందికి విమాన ప్రయాణాన్ని ఉపయోగించుకునే అవకాశం 80 కొత్త విమానాశ్రయం నిర్మాణం 27 నగరాల్లో సంవత్సరానికి 63 కిలోమీటర్ల సగటున మెట్రో రైల్ నెట్వర్క్ నిర్మాణం జరిగిందని మోకా వెంకట సుబ్బారావు తెలియజేశారు. జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ పిఎం కిసాన్ సమ్మన్ నిధి కింద 11.3 కోట్ల రైతు కుటుంబాలకు రెండు లక్షల కోట్లు అందించడం జరిగిందని పీఎం మండల పథకం కింద 37 కోట్ల రైతులకు బీమా అలాగే మూడు కోట్ల కంటే ఎక్కువమంది కిసాన్ క్రెడిట్ కార్డ్ లబ్ధిదారులకు మూడున్నర లక్షల కోట్లు రుణాలు మంజూరు మరిన్ని పంటలకు గిట్టుబాటు ధర ఉత్పత్తి ధర కంటే ఒకటిన్నర రెట్లు గిట్టుబాటు ధర పెంపు వేప పూత కలిపిన యూరియా వల్ల బ్లాక్ మార్కెటింగ్ అడ్డుగట్టు 23 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు జారీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే జరిగిందని పవన్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ మోర్చా జోనల్ ఇన్చార్జి దూరి రాజేష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పలివెల రాజు, జిల్లా సాంస్కృతిక విభాగం కార్యదర్శి గోనేమాడతల తల రవి ప్రకాష్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అసెంబ్లీ ఇన్చార్జి బిఎస్ మూర్తి, అల్లవరం మండలం అధ్యక్షుడు సుంకర సాయి అమలాపురం రూరల్ అధ్యక్షుడు గుమ్మల రెడ్డి నాయుడు, జిల్లా మెడికల్ సెల్ కన్వీనర్ కాళ్ళకూరి గోపి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వీళ్ళ దొరబాబు, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, నండూరి శ్రీరామ్, అమలాపురం పట్టణ కార్యదర్శి అరిగెల తేజ వెంకటేష్, బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement