Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 8:04 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 8:04 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 8:04 PM
Follow Us

సీఎం జగన్ ని కలిసిన హజ్ కమిటీ చైర్మన్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:

సీఎం జగన్ ని కలసిన హజ్ కమిటి ఛైర్మన్ గౌసులాజం,డైరెక్టర్ ఇబాదుల్లా ఖురేషి

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

అమరావతిలో క్యాంపు కార్యలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హజ్ కమిటి ఛైర్మన్ మరియు డైరెక్టర్లు హజ్ యాత్ర విజయవంతంగా జరిగినందున ముందు నుంచి వస్తున్న అనవాయితీ ప్రకారం పవిత్ర జమ్ -జమ్ జలం ముఖ్యమంత్రికి ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిసారు.అయనతో భేటీ అనంతరం రాష్ట్ర హజ్ కమిటి ఛైర్మన్ బి.ఎస్ గౌసులాజం మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే హజ్ యాత్రికుల బస్సులను జెండా ఊపి యాత్ర ను ప్రారంబించడం మొదటి అంశమైతే, రెండవది హజ్ యాత్ర ముగిసిన తరువాత హజ్ కమిటి వారు హజ్ కమిటి ఛైర్మన్ అధ్వర్యంలో మక్కా నుండి వచ్చిన పవిత్ర జమ్- జమ్ జలాన్ని జగన్ కు మర్యాదపూర్వకం అందించటం అనవాయితీ గా వస్తున్న సంప్రదాయం అన్నారు. హజ్ కమిటి కోసం విజయవాడ కేంద్రంగా నూతనంగా ఒక హజ్ హౌస్ నిర్మించడం కోసం 5 నుండి 6 ఎకరాల స్థలం కేటాయించవలసిందిగా ఆయనను కోరడం జరిగిందన్నారు.తాము కోరిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలో అన్ని పనులు పూర్తీ చేస్తానని హామీ ఇచ్చారని గౌసులాజం అన్నారు.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి హామీ పట్ల హజ్ కమిటి ఛైర్మన్ బి ఎస్ గౌసులాజం మరియు హజ్ కమిటి సభ్యులు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. ఇబాదుల్లా ఖురేషి మక్కా నుండి తెచ్చిన ఖజ్జూరాన్ని ఆయనకు ప్రేమగా తినిపించారు. దీనిపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో హజ్ కమిటి డైరెక్టర్ మరియు శాసనమండలి సభ్యులు ఇషాక్ బాషా,శాసనమండలి సభ్యులుఎం. డి రూహుల్లా,ఇమ్రాన్, ఖాదర్ బాషా,ముఫ్తి బాసిత్, మునిర్ బాషా,వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి నయిమ్,వైఎస్సార్సీపీ నాయకులు షరీఫ్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement