Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:09 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:09 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:09 AM
Follow Us

ఏజెన్సీలో సేవలు అందించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రంపచోడవరం:

ఏజెన్సీ లో సేవలను అందించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

 

నిరుపేద గిరిజన మహిళ లకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో సూరజ్ గనోరే పిలుపు

 

 

రంపచోడవరం , ( విశ్వం వాయిస్ న్యూస్ ) :- ఏజెన్సీలోని గిరిజనులకు, గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే కోరారు, గురువారం స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణంలో ఈ సంవత్సరం వరదలకు ఇబ్బంది పడుతున్న మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 300 మంది మహిళలకు నెస్ట్ కంపెనీ వారి ఆర్థిక సహాయంతో నిత్యవసర వస్తువులు కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే హాజరైనారు, ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన ప్రాంతం అయినందున మారుమూల గిరిజన ప్రజలకు అభివృద్ధిపరిచే విధంగా వివిధ రకాలైన స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి గిరిజన సమస్యలు తెలుసుకుని ఆయా సంస్థలు పరిష్కరించే విధంగా మా దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు, జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో నెస్ట్ కంపెనీ ఇండియా ఆర్థిక సహాయంతో 10 కేజీల బియ్యం, మూడు రకాల పప్పులు, కేజీ ఉప్పు, కేజీ సెనగలు, కేజీ పంచదార, మంచి నూనె, పసుపు, కారం, ధనియాలు, మసాలా సామాగ్రి, తదితర నిత్యవసర వస్తువులు 300 మందికి ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు 300 కిట్లు తయారుచేసి సరఫరా చేయడం చాలా అభినందనీయమని ఆయా ప్రతినిదులకు అభినందనలు తెలిపారు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సమయాలలో బ్లడ్ కావలసి ఉన్న ఎడల బ్లడ్ ఏర్పాటు చేయుటకు ఒక బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా మారుమూల గ్రామాలలో గిరిజనులకు స్వచ్ఛమైన త్రాగునీరు ఏర్పాటు చేయుటకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు, ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు చేయాలని ఆయన కోరారు, అనంతరం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థలో బాగా పనిచేసిన ప్రతినిధులకు సర్టిఫికెట్లు, 300 మంది మహిళలకు నిత్యవసర కిట్లు ప్రాజెక్ట్ అధికారి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది , ఈ కార్యక్రమంలో అనిరుద్, జె సి ఐ కాకినాడ, హర్షవర్ధన్ రెడ్డి, మర్రి. సత్యనారాయణ జె సి ఐ తిరుపతి, ఉమ్మడి జిల్లా వినియోగదారుల సంఘం సమాఖ్య చైర్మన్ విశాఖపట్నం, వసీం అహ్మద్, తదితరులు పాల్గొన్నారు,

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement