విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
*ఉమ్మడి జిల్లాలలో రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ లోమొదటి బహుమతి సాధించిన*
*శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు*
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్:-
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు అమలాపురంలోని పలు ప్రాంతాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు చీపుర్లు పట్టి రోడ్లు పలు ప్రాంతాలను శుభ్రపరిచారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను ఏరి వాటిని ధ్వంసం చేశారు. పరిసరాలను శుభ్రపరిచి చెత్తను ఊడ్చివేశారు. ఈ కార్యక్రమంలో సేవారత్న కరాటం ప్రవీణ్, ప్రిన్సిపల్ కె. మనోహర్, సెక్రటరీ అండ్ కర్రీస్పాండెంట్ కె.వి.ఆర్.ఎన్ నరసింహారావు ,వై.వరప్రసాద్, సిహెచ్ జాన్ పాల్, కే శ్రావణ్ దిలీప్, బి. శ్రీనివాస్ , సంసోన్ , స్వచ్ఛ్ భారత్ రీజనల్ కోఆర్డినేటర్ రాముడు, వావ్ ప్రోగ్రామ్ ఏరియా కోఆర్డినేటర్ వెల్సన్ కృష్ణ, శేఖర్, వెంకటేష్ ,నాగరాజు, ఎమ్. సూర్యకుమారి, మాధురి, జి.కే .వై.బి.ఎన్. ఎల్ రోహిణి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.