Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 10:47 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 28, 2024 10:47 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 28, 2024 10:47 PM
Follow Us

ఘనంగా జిఎంసి బాలయోగి జయంతికి ఘాట్ వద్ద హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో నివాళులర్పించిన తెదేపా నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*ఘనంగా జిఎంసి బాలయోగి జయంతికి ఘాట్ వద్ద నివాళులర్పించిన తెదేపా నాయకులు*

 

*అంబేద్కర్ కోనసీమకే ముద్దుబిడ్డ కాదు తెలుగు వారందరికీ ముద్దుబిడ్డ*

 

*తండ్రికి మించిన తనయుడు హరీష్ బాలయోగి అని తెలిపిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం అక్టోబర్ 1 అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి ప్రదాత, దివంగత నేత స్వర్గీయ మాజీ లోక్ సభ స్పీకర్*జి ఎం సి బాలయోగి 71 జయంతి వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నిర్వహించటమే కాకుండా నల్ల వంతెన దగ్గర గల బాలయోగి ఘాట్ నందు బాలయోగి తనయుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ జి ఎం హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో ఘాట్ వద్ద నివాళుల కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సహసరుడు కి జయంతి నివాళులర్పించి మాట్లాడుతూ బాలయోగి అంబేద్కర్ కోనసీమకే ముద్దుబిడ్డ కాదు తెలుగు వారందరికీ ముద్దుబిడ్డని తెలిపారు .కోనసీమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని,సభాపతిగా విశిష్ట సేవలు అందించారని సభకే వన్నె తెచ్చారని అన్నారు.ఎదుర్లంక – యానం బ్రిడ్జి కొరకు ప్రత్యేక శ్రద్దచూపి పట్టుదలతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారని .నాలుగు అంచెల రహదారి అమలాపురం పార్లమెంటు మీదుగా వెళ్ళడానికి కూడా బాలయోగే కారణమని.తద్వారానే కోనసీమ అభివృద్ధి చెందిందని తెలిపారు.ఆయన వారసుడైన హరీష్ భవిష్యత్తులో మంచి పదవులు చేపట్టి తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షించారు.రాజకీయాలలోకి వస్తున్న యువత అంతా బాలయోగి క్రమశిక్షణ ,నియమ నిబద్ధత ,ప్రజలతో మమేకం ప్రతి ఒక్కరిని పేరుపేరునా పిలిచేవారని పేర్కొన్న వారిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి అనంతకుమారి,రెడ్డి సుబ్రహ్మణ్యం,బండారు సత్యానందం,ఆదిరెడ్డి వాసు,మెట్ల రమణబాబు,అయితాబత్తుల అనందరావు,చిల్లా జగ,పెచ్చెట్టి విజయలక్ష్మీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement