Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 18, 2024 8:03 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 18, 2024 8:03 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 18, 2024 8:03 AM
Follow Us

అహింసా వాదికి హింసాత్మక నివాళులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

అహింసావాదికి హింసాత్మక నివాళి

 

– ఎక్కడా అమలుకాని నిషేధ ఉత్తర్వులు

– యధేచ్చగా మద్యం, మాంసం అమ్మకాలు

– జాతిపిత ఆదర్శాలను తుంగలో తొక్కివేత

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ (సి.హెచ్.ప్రతాప్):

UN జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 2వ తేదీని జూన్ 15, 2007న అంతర్జాతీయ అహింసా దినంగా ప్రకటించింది. గాంధీజీ జీవితాంతం అహింసను బోధించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన కారణంగానే ఇది జరిగింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ప్రజలు గాంధీజీని సత్యం మరియు శాంతికి చిహ్నంగా గుర్తుంచుకుంటారు. గాంధీ జయంతి జాతీయ సెలవుదినం కాబట్టి, ఏదైనా వేడుకలు లేదా కార్యక్రమాన్ని నిర్వహించడం మినహా అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలు ఆ రోజు మూసివేయబడతాయి.జాతీయ పిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మద్యం గాని మాంస దుకాణాలు గానీ నిర్వహించకూడదని అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే అమలు కావడం గమనార్హం. మండలంలో పసలపూడి, చెల్లూరు గ్రామాలలో బహిరంగంగానే మాంసంతో దుకాణాలు చేర్చుకుని మాంసం విక్రయాలు సాగించారు. దీనిపై దుకాణదారులను కొందరు ప్రశ్నించ గా మాకు ఎటువంటి సమాచారం వాలంటరీ గానీ, పంచాయతీ అధికారులు, గ్రామ మహిళా పోలీసులు కానీ ఇవ్వలేదని వారు తెలిపారు… కొంతమంది స్వచ్ఛందంగానే మండలంలో తమ మాంసం దుకాణాలను మూసుకుని అహింస వాదికి ఘనంగా నివాళులర్పించారు. ఇది ఇలాగే కొనసాగితే గాంధీ జయంతి పేరు చెప్పుకొని మాంసం దుకాణాలు గాని, మద్యం దుకాణాలు తెరిచి ఉంటే ఎలా అని పలువురు దేశభక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నిషేధాజ్ఞలను పటిష్టం గా అమలు చేయడంతో పాటు వాటిని ఉల్లంఘించే దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement