Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, దోపిడి పాలకులకు గుణపాఠం చెప్పాలి.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఉచితాల ముసుగులో దోచుకుంటున్న ప్రజాధనాన్ని రక్షించుకుందాం.
– నేటి వ్యాపార రాజకీయ పార్టీలను భహిష్కరిద్దాం.
– మేడా శ్రీనివాస్
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిలుపు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

ఆంధ్రప్రదేశ్ లో నూతన పాలనను ప్రోత్సహిద్దాం. ప్రస్తుత పాలకులను సాగనంపుదాం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ యువతకు పిలుపు నిచ్చారు.ప్రజాస్వమ్యంగా చెప్పుకుంటున్న అప్రజాస్వామ్యంలో నేడు ప్రజలు జీవిస్తున్నారని, మనం రూపొందించుకున్న చట్టాలు నేరగాళ్ల కోసం కాకుండా, సామాన్యులను వేధింపులకు గురిచేయటానికి, వారి భవిష్యత్ ను పాడుచేయటానికి మాత్రమే ఉపయోగపడుతుందని,

చట్టం రక్షిస్తుంది, న్యాయం కాపాడుతుంది అనే నమ్మకాలేని సమాజంలో నేడు పౌరులు బిక్కు బిక్కు మంటు జీవిస్తున్నారని, మన చట్టాలు సంపన్నులకు, కార్పోరేట్ ఆర్ధిక నేరగాళ్లకు రక్షణ కవచం వలే ఉపయోగపడుతుందని,నేడు మనం అత్యున్నత ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న భారతదేశంలో ప్రజలకు 92% సమాన న్యాయం అందటం లేదని, న్యాయం పొందటం అతి ఖరీదైనదిగా మారిపోయిందని, నిత్యం మన పాలకులు సాక్షిగా మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూనే వున్నాయని, మీడియా లో ఒక ఘటనపై వార్త వెలువడితేనే మన యంత్రాంగం లో కొంతమేరకు కదలిక వస్తుందని, మన సమాజంలో నీతి న్యాయం అంటు బ్రతికితే సాధ్యపడదని పాలకులు పౌరులను పరోక్షంగా హెచ్చిరిస్తుంటారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.నేడు చట్ట సభల్లో ప్రాతినిత్యం వహిస్తున్న వారిలో మెజారిటి స్థానం దోపిడి పాలకులదే నని, విద్యావంతులైన అధికార యంత్రాంగంను బానిసలుగా ఆడిస్తున్నారని,
నిజాయితీగా అధికారిక విధులు నిర్వహించడం చేతకాని అధిక శాంతం అధికారులు ప్రజలను రాక్షసుల వలే పీడిస్తు పాలకులకు బానిసల వలే ఊడిగం చేస్తు వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని, నేడు నేరగాళ్లు పాలకులుగాను, అవినీతి పరులు ఉద్యోగులుగాను శాసనకర్తలుగా వ్యవస్థను శాసిస్తున్నారని,ప్రస్తుత భారత్ పాలకులు ఆఫ్గానిస్తాన్, శరియా, పస్తుం లాంటి అనాగరిక వ్యవస్థను, శాసనాలను ఆదర్శంగా తీసుకుంటున్నారని, ఓటర్లను గొర్రెల మందలో కొనుక్కున్నట్టు కొనుక్కుంటు రాజ్యాంగేతర శక్తుల వలే నియంత పాలన సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.ప్రస్తుత పాలనను ప్రజలు సంస్కరించుకో లేకపోతే రానున్న రోజులు భయానకరంగా వుంటాయని, పాలకులు చేసే ప్రతి దోపిడీకి చట్టాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని,
సామాన్య ప్రజలకు అండగా నిలిచే విధంగా అమలు జరిగే చట్టాలు, అలాంటి అధికారులు వ్యవస్థలో లేకపోవటం ప్రజల దురదృష్టం గా భావించాలని, యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తున్నారని, మత్తు ప్రదార్ధాల వ్యాపారాలకు పాలకులే అండగా నిలుస్తున్నారని, విద్యాలయాల్లో సైతం మాదకద్రవ్యాల సరఫరా యదేచ్చగా సాగుతున్నా సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారని, ప్రతి దోపిడీకి పాలకుల ప్రోత్సాహం వుంటుందని,
నేడు కొనసాగుతున్న ప్రభుత్వ సంస్థల సేవలు నిరుపియోగంగా వున్నాయని,ప్రభుత్వ కార్యాలయాల్లో బాధితులు దాఖలు పరిచే అర్జీలు సైతం అవినీతి అధికారులు వ్యాపారంగా మార్గం చేసుకుంటున్నారని,
నకిలీ, కల్తీ వ్యాపారాలకు ప్రభుత్వ సేవలు మెండుగా వుంటున్నాయని, నిబంధనలు మేరకు నడుచుకునే వారికి ప్రభుత్వం నుండి రిక్త హస్తాలు చూపిస్తు వ్యవస్థపై యగటు పుట్టిస్తున్నారని, మెరుగైన పాలనా సంస్కరణలను ప్రజలు సాధించుకొలేకపోతే ఆటవిక ప్రజా స్వామ్యానికి ప్రజలు బలైపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చిరించారు.
ప్రజల శ్రమను, కష్టాన్ని ప్రస్తుత పాలకులు దోచుకుంటు రోజు రోజుకు పేదరికాన్ని పెంచుతున్నారని,
ఉచితాల ముసుగులో అన్నింటా ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి వారిని ఆర్ధికంగా దోచుకుంటున్నారని, పాలకులు వ్యూహాత్మకంగా శాస్త్రీయతను అందని విధంగా ఓటర్ల మెదడులోకి ఒక రకమైన కుత్రిమ మత్తు వైరస్ ను చొప్పించారని, ఆ వైరస్ ప్రత్యేకత ఏమిటంటే దోచుకుంటున్న వారికి జై జై లు కొట్టటమేనని, ప్రజల జీవితాలను వారి బిడ్డల భవిష్యత్ ను సర్వనాశనం చేసుకోవటమే ఈ కుత్రిమ వైరస్ ప్రత్యేక అని, ప్రజలను బిక్షగాళ్లుగా మెరుస్తున్నా పరవాలేదనుకుని దోపిడి పాలకులను గద్దె నెక్కిస్తున్న ఓటర్లు బహుసా ఆంధ్రప్రదేశ్ లోనే వున్నారా ! లేక అన్ని రాష్ట్రాల్లోను వున్నారా అనే సందేహానికి నేటికి సమాధానం దొరకటం లేదని,చిన్నతనం నుండి చదువుకున్న రాజ్యాంగ ప్రాధిమిక హక్కులు నేడు ఖరీదైన వ్యాపారంగా మారిపోయాయని, విద్యా వైద్యం సామాన్యుడికి బారంగా మార్చేసారని, స్వచ్ఛమైన త్రాగునీరును విషాద్రావంగా మార్చేసి రసాయనిక త్రాగునీరుకు ధరనిర్ణయించిం పాలకులను అందలమెక్కిస్తున్నామని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు.
మనకు పట్టిన దరిద్రాలను వదిలించుకోవటానికి, మన బిడ్డల భవిష్యత్ ను కాపాడుకోవటానికి, మన జీవితాలను భద్రతగా మలుచుకోవటానికి, ప్రకృతిని కాపాడుకుంటు ఆరోగ్యంగా జీవించటం కోసం ఒకే ఒక్క మార్గంగా ప్రజలు యుద్ద ప్రాతిపాదికన నేటి వ్యాపార రాజకీయ పార్టీలను శాశ్వతంగా బహిష్కరించి మెరుగైన రాజకీయ పాలనను ప్రోత్సహించాలని, అందుకోసం అవిశ్రాంతంగ ఉద్యమిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టిని ప్రజలు స్వచ్చందంగా బలోపేతం చేయాలని, పేదరికం లేని సంపన్న రాష్ట్రమే మన లక్ష్యంగా ప్రజలే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిర్ణయాధికారులు కావాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు.సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి,లంక దుర్గాప్రసాద్,సిమ్మా దుర్గారావు , ఎండి హుస్సేన్,దుడ్డె సురేష్,దోషి నిషాంత్ , వర్ధనపు శరత్ కుమార్ , మార్త ప్రభాకర్ , వాడపల్లి జ్యోతిష్ , కోమర్తి గోపి శ్రీనివాసరావు, కారుమూరి శిరీష,కారుమూరి యుగంధర్,మట్టపర్తి తులసి రావు ,నాగూరి అన్నపూర్ణ ,మాసా అప్పాయమ్మ , మేకల రవి కిరణ్, పేరూరి శివ ,బైరెడ్డి అశోక్ ,ఓదూరు సాయి,గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొనియున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!