Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

సహనం సత్యం అనే మార్గాన్ని అనుసరిస్తే విజయాన్ని సాధించవచ్చు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

సహనం, సత్యం అనే మార్గాన్ని అనుసరిస్తే విజయం సాధించవచ్చు….

 

ఎంపీపీ నౌడు వెంకటరమణ..

 

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:

అహింసా మార్గాన్ని అనుసరించి దేశానికి స్వాతంత్య్రం అందించడంలో కీలకపాత్ర పోషించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని రాయవరం మండలం ఎంపీపీ నౌడు వెంకటరమణ అన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ … సహనం, సత్యం అనే మార్గాన్ని అనుసరిస్తే కష్టతరమైన పోరాటాల్లో విజయం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తిగా గాంధీజీ అందరికి సుపరిచితమేనన్నారు. అక్టోబరు 2, 1986 మహాత్మా గాంధీ జన్మించారన్నారు. భారతదేశంలోనే కాదు. ఆయన మాటలు విదేశాల్లోని ప్రజలపై ప్రభావం చూపించాయని తెలిపారు. ఆయన ఆలోచనలు జీవితానికి కొత్త కోణాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతాయన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ , తేతల సుబ్బరామా రెడ్డి , తాడి రామచంద్రారెడ్డి , ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను మరియు గ్రామ పంచాయతీ , సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.వి. సావరం గ్రామంలో గాంధీ జయంతి కార్యక్రమం లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాకి కృష్ణవేణి కోటేశ్వరరావు, ఉపసర్పంచ్ వెలగల సత్యనారాయణ రెడ్డి, సెక్రటరీ మల్లిడి నారాయణ రెడ్డి, వార్డు మెంబర్స్, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!